‘నేను మహిళల చిత్రాలకు అనుకూలం’ | I'm in favour of women-oriented films: Nawazuddin Siddiqui | Sakshi
Sakshi News home page

‘నేను మహిళల చిత్రాలకు అనుకూలం’

Published Tue, Jul 4 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

I'm in favour of women-oriented films: Nawazuddin Siddiqui

న్యూఢిల్లీ: తాను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకే ఎక్కువ అనుకూలంగా ఉంటానని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ అన్నారు. ఆయన తాజా చిత్రం మామ్‌లో శ్రీదేవీతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి ఓ శక్తిమంతమైన పాత్రను పోషించారు.

‘నేను మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సానుకూలంగా ఉంటాను. ఎందుకంటే ఈరోజుల్లో ప్రతి రంగంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది విద్య కావొచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కావొచ్చు, క్రీడలు కావొచ్చు. ఈ మార్పును ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సిందే’ అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మహిళలను సినిమాల్లో ఒక వస్తువులుగా చూపించారు.. కానీ, ఇప్పుడు మాత్రం సినిమాలు వారి పైనే వస్తున్నాయి. మనం తప్పక స్వాగతించాలి’ అని ఆయన అన్నారు. గతంలో నవాజుద్దీన్‌ విద్యాబాలన్‌ నటించిన కహానీ చిత్రంలో పవర్‌ఫుల్‌ దర్యాప్తు అధికారిగా కనిపించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement