కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది! | Arizona mom killed her three sons | Sakshi
Sakshi News home page

కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది!

Published Tue, Jun 7 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది!

కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది!

అరిజోనా: అమెరికాలోని అరిజోనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఓ మహిళ మాదకద్రవ్యాల మత్తులో తన ముగ్గురు కొడుకులను దారుణంగా హతమార్చింది. అనంతరం తనకుతాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆక్టేవా రోజర్స్ అనే మహిళ తన ముగ్గురు కొడుకులు జైకరే రెహ్మాన్(8), జెరిమియా ఆడమ్స్(5), రాబిన్సన్(2 నెలలు)లను ఇటీవల దారుణంగా హత్య చేసింది. అతి ప్రమాదకరమైన మత్తుపదార్థాలు తీసుకున్న ఆక్టేవా.. ఆ మత్తులోనే కన్న కొడుకులను దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం వారి మృతదేహాలను అల్మారాలో దాచి.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. గొంతుకోసుకొని బాత్ రూంలో దాక్కున్న ఆక్టేవాను సోదరుడు గుర్తించి ఆసుపత్రికి తరలించాడు. ఆక్టేవా గతంలోనూ ప్రమాదకరమైన సింథటిక్ మారిజునా అనే మత్తుపదార్థాన్ని వాడినట్లు విచారణలో తేలింది. ఇది తీవ్ర మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని.. ఆ ప్రభావంతోనే ఆమె ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement