Three sons
-
కన్నపేగు భారమైంది
కనిపెంచిన కన్న తల్లి వారికి భారమైంది. శక్తి ఉన్నంత వరకు ఊడిగం చేసిన అమ్మ ఇప్పుడు కానిదైంది. ముగ్గురు కొడుకులు ఉన్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. చివరి రోజుల్లో బిడ్డల దగ్గర ఉండాలని ఆ కన్నపేగు ఆరాటపడుతున్నా కాదుపొమ్మన్నారు. ఎనిమిది పదుల వయసు సమీపిస్తున్న మాతృమూర్తిని వీధిపాలు చేశారు. ఆ వృద్ధురాలి దీనావస్థను చూసి చలించిన సాక్షి ప్రతినిధి ఆ కొడుకులకు నచ్చచెప్పినా వారి మనసు కరగలేదు. పోలీసులు వచ్చి హెచ్చరించడంతో వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప ఇంటికి తీసుకెళ్లేందుకు వారి మనసొప్పలేదు -
కాటేసిన కిడ్నీ
* ముగ్గురు కుమారులతో కలసి తల్లి ఆత్మహత్య * తల్లి ఒకరికి, తండ్రి మరొకరికి కిడ్నీలివ్వాలనుకున్నారు * మూడో కొడుకును ఏం చేయాలనే మనోవేదన * తనవల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లడిల్లిన తల్లి * తూర్పుగోదావరి జిల్లా అమరవిల్లిలో హృదయవిదారక ఘటన పిఠాపురం (తూర్పుగోదావరి జిల్లా): ముగ్గురు కొడుకులకూ మూత్రపిండాలు పాడయ్యాయి. తండ్రి ఒకరికి, తల్లి మరొకరికి కిడ్నీలు ఇద్దామనుకున్నా.. మూడో కుమారుడికి ప్రాణాపాయం తప్పదు. ఎవరినీ వదులుకోలేని నిస్సహాయ పరిస్థితి. పిల్లల మేనమామలు గతంలో కిడ్నీల వ్యాధితోనే మరణించారు. ఈ సమస్య వంశపారంపర్యంగా కొనసాగే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. తనకు పుట్టినందునే పిల్లలు మహమ్మారి వ్యాధి బారినపడ్డారనే దోష భావన తల్లిని వెంటాడేది. బుధవారం రాత్రి కొడుకుల్ని బతికించుకోలేని నేనెందుకు బతకాలని కుమిలిపోయిన తండ్రిని భార్య, కుమారులు ఓదార్చారు. అందరూ భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి మెలకువ వచ్చిన తండ్రికి భార్య, ముగ్గురు పిల్లలు కన్పించలేదు. ఊరంతా గాలించాడు. ఫలితం లేదు.ఉదయాన్నే ఉప్పుటేరులో నాలుగు శవాలు తేలాయని తెలిసింది. అవి తన భార్య, పిల్లల శవాలేనని తెలిసిన తండ్రి గుండెలవిశేలా రోదిస్తూ కుప్పకూలిపోయాడు. ముగ్గురు కొడుకులతో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక సంఘటనతో ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామానికి చెందిన రాగాల రాము, భూలక్ష్మి (45) దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె. ఆ కుటుంబానికి రెండెకరాల పొలం ఉంది. కుమార్తెకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. కొడుకులు ప్రభుప్రకాష్ (22), అనిల్ కుమార్ (20), ప్రేమసాగర్ (18) ముగ్గురూ కొంతవరకు చదువుకున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రేమసాగర్ అస్వస్థతకు గురికావడంతో కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అతనికి కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయూలని వైద్యులు చెప్పారు. కొడుకుకు కిడ్నీ ఇవ్వడానికి రాము సిద్ధమయ్యూడు. కొన్నాళ్ల క్రితం ప్రభుప్రకాష్, అనిల్‌కుమార్‌లు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరీక్షలు చేసిన వైద్యులు వారికీ కిడ్నీలు పాడయ్యాయని, మార్పిడి చేయించక తప్పదని చెప్పారు. దాంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఆరోగ్యశ్రీలో డయూలసిస్కు తప్ప కిడ్నీల మార్పిడికి అవకాశం లేదు. ఉన్న ఆస్తిని తెగనమ్మి తండ్రి ఒకరికి, తల్లి ఒకరికి కిడ్నీలిచ్చి మార్పిడి చేరుుంచాలనుకున్నా ఎవరికి మార్పిడి చేయిం చాలి, ఎవరిని వదిలేయాలో తెలీని దుస్థితి వారిని తీవ్ర మనోవ్యథకు గురిచేసింది. తండ్రిని ఓదార్చి తాము తనువు చాలించారు ముగ్గురికీ డయూలసిస్ చేయిస్తున్నా పరిస్థితి క్రమేణా క్షీణించసాగింది. బుధవారం రాత్రి ఆవేదనతో విలపిస్తున్న రామును ఓదార్చిన భార్య, కుమారులు.. తాము మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు నాలుగు శవాలు కన్పించాయి. స్థానికులు అవి భూలక్ష్మి, ఆమె ముగ్గురు కొడుకులవిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా దొరకడం, నలుగురి మృతదేహాలూ తాడుతో కట్టి ఉండడంతో తల్లీకొడుకులు తొలుత పురుగుల మందు తాగి, తర్వాత తాడుతో కట్టుకుని ఉప్పుటేరులో దూకి ఉంటారని భావిస్తున్నారు. కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ డేవిడ్‌రాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకులను చంపి.. బాత్రూంలో దాక్కుంది!
అరిజోనా: అమెరికాలోని అరిజోనాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల ఓ మహిళ మాదకద్రవ్యాల మత్తులో తన ముగ్గురు కొడుకులను దారుణంగా హతమార్చింది. అనంతరం తనకుతాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రి పాలైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆక్టేవా రోజర్స్ అనే మహిళ తన ముగ్గురు కొడుకులు జైకరే రెహ్మాన్(8), జెరిమియా ఆడమ్స్(5), రాబిన్సన్(2 నెలలు)లను ఇటీవల దారుణంగా హత్య చేసింది. అతి ప్రమాదకరమైన మత్తుపదార్థాలు తీసుకున్న ఆక్టేవా.. ఆ మత్తులోనే కన్న కొడుకులను దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం వారి మృతదేహాలను అల్మారాలో దాచి.. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. గొంతుకోసుకొని బాత్ రూంలో దాక్కున్న ఆక్టేవాను సోదరుడు గుర్తించి ఆసుపత్రికి తరలించాడు. ఆక్టేవా గతంలోనూ ప్రమాదకరమైన సింథటిక్ మారిజునా అనే మత్తుపదార్థాన్ని వాడినట్లు విచారణలో తేలింది. ఇది తీవ్ర మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని.. ఆ ప్రభావంతోనే ఆమె ఈ హత్యలకు పాల్పడినట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు. -
అమ్మకు అవమానం
- కన్నకొడుకులే కర్కశులుగా మారిన వైనం - పోషణకు వాటాలు వేసుకున్న కఠినాత్ములు - చనిపోయినా అంత్యక్రియలకు ముందుకు రాని కొడుకులు పార్వతీపురం(విజయనగరం జిల్లా): 'నపుత్రస్య గతిర్నాస్తి' అన్నది ఆర్యోక్తి. తలకొరివి పెట్టేందుకు కొడుకులు కావాలన్నది దాని అంతరార్థం. కానీ, తల్లి రుణం తీర్చుకోవడానికి వంతులు వేసుకున్నారు ఈ కుమారులు. అంతేకాదు... ఆమె మరణిస్తే కనీసం అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాకుండా అనాథలా శవాన్ని శ్మశాన వాటికలో వదిలేసిన సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటు చేసుకుంది. పార్వతీపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి స్వర్గీయ వారణాసి బాలకృష్ణ మరణానంతరం అతని భార్య వారణాసి కమలమ్మ(70)ను, ఆమె ముగ్గురు కొడుకులు వారణాసి మోహనరావు(మందులషాపు నడుపుతున్నారు), వారణాసి శ్రీహరి(ఏజన్సీలు నడుపుతున్నారు), వారణాసి శ్రీనివాసరావు(విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నారు) తలో నాలుగు నెలలు పోషించేందుకు వాటాలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోని మూడో కొడుకు వద్ద ఉన్న కమలమ్మను నాలుగు నెలలు పూర్తికావడంతో శనివారం కారులో పార్వతీపురంలో ఉన్న మరో కొడుకు వద్దకు తీసుకువస్తున్నారు. కారు బొబ్బిలి సమీపానికి చేరుకోగానే ఆమె మృతి చెందింది. వైజాగ్ నుండి తీసుకువస్తున్న కొడుకు చనిపోయిన తన తల్లి మృతదేహాన్ని విశాఖపట్టణానికి తీసుకువెళ్లలేక, పార్వతీపురం, మక్కువలో ఉన్న తన సోదరుల ఇళ్లకు తీసుకెళ్లేందుకు యత్నించగా వారు నిరాకరించారు. దీంతో చేసేది లేక పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం వరకు ఉంచి చివరకు రాయగడ రోడ్డులోని శ్మశాన వాటికకు చేర్చాడు. అక్కడ అంత్యక్రియలు పూర్తచేసేందుకు కూడా మిగిలిన ఇద్దరు కుమారులు రాలేదు. విషయం తెలుసుకున్న కమలమ్మ బంధువులు శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుమారులు అనుసరిస్తున వైఖరిపై పట్టణ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ బెలగాం జయప్రకాష్‌నారాయణ, గుంట్రెడ్డి రవి, వారణాశి విస్సు, పట్నాన కిరణ్ తదితరులు శ్మశాన వాటికకు చేరుకొని ఆ ముగ్గురు కొడుకులకు చీవాట్లు పెట్టి ఆ మాతృమూర్తికి దహన సంస్కారాలు జరిగేలా చూశారు. -
శతాధిక వృద్ధురాలి మృతి
డోర్నకల్: వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ళసంకీస గ్రామపంచాయితీ పరిధిలోని బొడ్రాయితండాకు చెందిన శతాధిక వృద్ధురాలు ఆంగోత్ రాములమ్మ (105) అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.