కన్నపేగు భారమైంది | than the mother bharamaindi them | Sakshi
Sakshi News home page

కన్నపేగు భారమైంది

Published Mon, Feb 13 2017 10:43 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

కన్నపేగు భారమైంది - Sakshi

కన్నపేగు భారమైంది

కనిపెంచిన కన్న తల్లి వారికి భారమైంది. శక్తి ఉన్నంత వరకు ఊడిగం చేసిన అమ్మ ఇప్పుడు కానిదైంది. ముగ్గురు కొడుకులు ఉన్నా ఏ ఒక్కరూ కనికరించలేదు. చివరి రోజుల్లో బిడ్డల దగ్గర ఉండాలని ఆ కన్నపేగు ఆరాటపడుతున్నా కాదుపొమ్మన్నారు. ఎనిమిది పదుల వయసు సమీపిస్తున్న మాతృమూర్తిని వీధిపాలు చేశారు.

ఆ వృద్ధురాలి దీనావస్థను చూసి చలించిన సాక్షి ప్రతినిధి ఆ కొడుకులకు నచ్చచెప్పినా వారి మనసు కరగలేదు. పోలీసులు వచ్చి హెచ్చరించడంతో వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నారే తప్ప ఇంటికి తీసుకెళ్లేందుకు వారి మనసొప్పలేదు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement