‘మామ్’ విజయంలో మన ఈసీఐఎల్
యాంటెనా తయారీలో పాలుపంచుకున్న ఈసీఐఎల్ సంబరాలు చేసుకున్న సంస్థ సిబ్బంది
హైదరాబాద్: అగ్ర దేశాలు ఆశ్చర్యపడేలా చేసిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయయాత్రలో హైదరాబాద్‌లోని ఈసీఐ ఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్) పాత్ర కూడా ఎంతో ఉంది. ‘మామ్’ పర్యటించిన దూరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడిన యాంటెనాను రూపొందించడంలో ఈసీఐఎల్ కీలకపాత్ర పోషించింది. అందుకే గురువారం మంగళ్‌యాన్ యాత్ర విజయవంతం కావడంతో ఇక్కడ సిబ్బంది కూడా సంబరాలు జరుపుకున్నారు. ‘మంగళ్‌యాన్’ యాత్రలో తమ సంస్థ కృషి ఉందని ఈసీఐఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
మంగళ్‌యాన్‌లో సేవలందించిన ఈసీఐఎల్ తయారీ యాంటెనా వివరాలు....
యాంటెనా పేరు : ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) యాంటెనా
ఏర్పాటు చేసిన ప్రాంతం : బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద
బరువు : 300 టన్నులు
వ్యాసం : 32 మీటర్లు
ఎలివేషన్ : 0 నుంచి 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది.
తయారీ ఖర్చు : రూ.65 కోట్లు
తయారీలో పాల్గొన్న సంస్థలు : ఈసీఐఎల్, బార్క్, ఇస్రో
తయారీ సమయం : దాదాపు 14 నెలలు
నియంత్రించే దూరం : భూమి నుంచి 65 కోట్ల కి.మీ.లు
యాంటెనా పని ప్రారంభించిన తేదీ : 2013, నవంబర్ 5
మొదటి సిగ్నల్ పంపిన సమయం : ఉదయం 8.00 గంటలకు, 24 సెప్టెంబర్ 2014
(అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లో...)
మొదటి సిగ్నల్ అందుకున్న సమయం : ఉదయం 11.45 గంటలకు, 24 సెప్టెంబర్ 2014న 2008లో ‘చంద్రయాన్’మిషన్‌లో కూడా ఈ యాంటెనా సేవలందించింది.