Antenna
-
క్రికెట్ వైరల్ వీడియో: ఆనంద్ మహీంద్ర ట్వీట్, నెటిజన్ల నోస్టాల్జియా
సాక్షి, ముంబై: స్మార్ట్‌టీవీలు, శాటిలైట్ చానెల్స్ హవా రాకముందు దూరదర్శన్‌లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు భారీ క్రేజ్ ఉండేది. ఆయా మ్యాచ్‌ల లైవ్ చూసేందుకు జనం ఎగబడేవారు. నిజానికి రేడియో కామెంటరీ తర్వాత విజువల్ పరంగా అదొక్కటే ప్రేక్షకులకు వరం.అయితే పాత రోజుల్లో యాంటెన్నా కష్టాలు, దూరదర్శన్‌లో క్రికెట్ అంటూ ఒక వీడియో ఇటీవల ఇంటర్నెట్లో బాగా హల్ చల్ చేస్తోంది. అలనాటి యాంటెన్నా, కరెంట్, పిక్చర్ క్వాలిటీ తదితర కష్టాలను గుర్తుచేస్తున్న ఈవీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇది చదవండి: కోట్లాదిమందికి ప్రాణదాత, ఓఆర్ఎస్ సృష్టికర్త ఇకలేరు తాజాగా ఈ వీడియోను పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఎవరైనా ఈ వీడియోకి చక్కటి మ్యూజిక్ ట్రాక్ యాడ్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పలు రకాల కమెంట్లతో సందడి చేస్తున్నారు. యాంటెన్నా ఒక్కటే కాదు సార్! ఆ రోజుల్లో చాలా ఇళ్లలో బ్లాక్ అండ్ టీవీలు ఉండేవి. సో...పిక్చర్ ట్యూబ్ సమస్యలు కూడా చాలా కామన్‌గా కనిపించేవి కామెంట్ చేశారు. Remember this guys 😁😁😁 fixing of TV Ariel cricket match on DD ❤️❤️❤️ pic.twitter.com/rq1KWcczBd — 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) October 15, 2022 Someone should be able to add an appropriate music track in sync with this… https://t.co/1V06POnv7c — anand mahindra (@anandmahindra) October 17, 2022 Doordarshan experience. pic.twitter.com/1kKETatGIt — Ajit Aditya (@shashijeet990) October 17, 2022 -
విచ్చుకున్న ‘రీశాట్–2బీఆర్1’ యాంటెన్నా
సూళ్లూరుపేట : దేశీయ అవసరాల నిమిత్తం బుధవా రం సాయంత్రం 3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా రోదసీలోకి పంపించిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ (రీశాట్–2బీఆర్1) ఉపగ్రహానికి అమర్చిన రేడియల్ రిబ్ యాంటెన్నా గురువారం విజయవంతంగా విచ్చుకున్నట్లు ఇస్రో ప్రకటించింది. 628 కేజీల బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 576 కిలోమీటర్లు ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 3.6 మీట ర్లు వ్యాసార్థం కలిగిన రేడియల్ రిబ్ యాంటెన్నాను ఇందులో వినియోగించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 9.12 నిమిషాల వ్యవధిలో యాంటెన్నా విజయవంతంగా విచ్చుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఉపగ్రహం సేవలు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు సమీపంలో హాసన్‌లో వున్న మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. -
స్మార్ట్ఫోన్లకు డిజిటల్ యాంటెనా!
లండన్: భవిష్యత్తులో రాబోయే స్మార్ట్ఫోన్ల కోసం అత్యంత సమర్థవంతమైన నూతన యాంటెన్నాలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రస్తుత స్మార్ట్ఫోన్లలో ఉండే యాంటిన్నాల కంటే ఇవి వంద నుంచి వెయ్యి రెట్లు సమర్థవంతం, వేగవంతంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ఈ నూతన సాంకేతికత కలిగిన యాంటిన్నాలను ఫిన్ల్యాండ్లోని ఆల్టో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాంటెన్నాల ద్వారా ఇంటర్నెట్ వేగం గణనీయంగా పెరుగుతుందని ఆల్టో యూనివర్సిటీకి చెందిన జరీ మత్తి హన్నుల్లా తెలిపారు. ప్రస్తుతం ఉన్న యాంటెన్నాలు ఫోన్ పై భాగంలో కానీ, కింది భాగంలో కానీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఉంటాయన్నారు. కానీ ఈ డిజిటల్ యాంటెన్నా ఫోన్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదని అందువల్ల స్క్రీన్ సైజ్ కూడా ఎక్కువగా ఉండేలా నూతన ఫోన్లను డిజైన్ చేయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీటి ద్వారా రేడియేషన్ ప్రభావం కూడా తక్కువగా ఉంటుందని, మొబైల్లో సిగ్నల్స్‌ను అధిక సామర్థ్యంతో అందిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ నూతన సాంకేతికత కలిగిన డిజిటల్ యాంటిన్నా ద్వారా 5జీ మొబైల్స్‌లో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావచ్చని పరిశోధకులు వెల్లడించారు. కాగా, ఈ పరిశోధన ఫలితాలు ఐఈఈఈ యాంటిన్నాన్ అండ్ వైర్లెస్ ప్రొపగేషన్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. -
‘మామ్’ విజయంలో మన ఈసీఐఎల్
యాంటెనా తయారీలో పాలుపంచుకున్న ఈసీఐఎల్ సంబరాలు చేసుకున్న సంస్థ సిబ్బంది హైదరాబాద్: అగ్ర దేశాలు ఆశ్చర్యపడేలా చేసిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయయాత్రలో హైదరాబాద్‌లోని ఈసీఐ ఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్) పాత్ర కూడా ఎంతో ఉంది. ‘మామ్’ పర్యటించిన దూరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడిన యాంటెనాను రూపొందించడంలో ఈసీఐఎల్ కీలకపాత్ర పోషించింది. అందుకే గురువారం మంగళ్యాన్ యాత్ర విజయవంతం కావడంతో ఇక్కడ సిబ్బంది కూడా సంబరాలు జరుపుకున్నారు. ‘మంగళ్యాన్’ యాత్రలో తమ సంస్థ కృషి ఉందని ఈసీఐఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళ్యాన్లో సేవలందించిన ఈసీఐఎల్ తయారీ యాంటెనా వివరాలు.... యాంటెనా పేరు : ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) యాంటెనా ఏర్పాటు చేసిన ప్రాంతం : బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద బరువు : 300 టన్నులు వ్యాసం : 32 మీటర్లు ఎలివేషన్ : 0 నుంచి 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. తయారీ ఖర్చు : రూ.65 కోట్లు తయారీలో పాల్గొన్న సంస్థలు : ఈసీఐఎల్, బార్క్, ఇస్రో తయారీ సమయం : దాదాపు 14 నెలలు నియంత్రించే దూరం : భూమి నుంచి 65 కోట్ల కి.మీ.లు యాంటెనా పని ప్రారంభించిన తేదీ : 2013, నవంబర్ 5 మొదటి సిగ్నల్ పంపిన సమయం : ఉదయం 8.00 గంటలకు, 24 సెప్టెంబర్ 2014 (అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లో...) మొదటి సిగ్నల్ అందుకున్న సమయం : ఉదయం 11.45 గంటలకు, 24 సెప్టెంబర్ 2014న 2008లో ‘చంద్రయాన్’మిషన్‌లో కూడా ఈ యాంటెనా సేవలందించింది.