
శ్రీదేవి అడిగితే కాదనగలనా?
‘‘శ్రీదేవికి నేను పెద్ద ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి ఆమెను అభిమానిస్తున్నా. ఆమె సినిమాకి పాటలు స్వరపరిచే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు’’ అన్నారు సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్. ‘మామ్’ సినిమా రూపంలో ఆయనకు ఆ గోల్డెన్ ఛాన్స్ రానే వచ్చింది. ‘‘శ్రీదేవిగారు ‘నువ్వీ సినిమాకి చేయాలని అడిగితే కాదనగలనా? వెంటనే ఒప్పేసుకున్నా. శ్రీదేవిగారు అద్భుతమైన నటి. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని రెహమాన్ అన్నారు. రవి ఉడయవర్ దర్శకత్వంలో శ్రీదేవి టైటిల్ రోల్‌లో ఆమె భర్త బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 7న విడుదల కానుంది.