అమ్మకు బీమా బహుమతిగా ఇద్దాం!
అమ్మ అంటే... వెలకట్టలేని రెండక్ష రాలు. అమ్మకు బీమా పాలసీని బహుమతిగా ఇవ్వడం నిజంగా ఓ ప్రత్యేకతే..
మార్కెట్లో బీమాలెన్నో..
ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ అమ్మ అవసరాలను ప్రాధాన్యంలోకి తీసుకోవాలి. వాటికి అనుగుణంగా పాలసీని ఎంచుకోవాలి. అవేంటో చూద్దాం...
వ్యక్తిగత ప్రమాద బీమా: ఎవరైనా ప్రమాదానికి గురికావొచ్చు. కాబట్టి ఈ బీమా తీసుకోవడం మంచిది. ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులపై, సన్నిహితులపై ఆర్థికంగా ఆధారపడటం కొంత తగ్గుతుంది.
ఆరోగ్య బీమా: ఆమె బాగుంటేనే.. మనం బాగున్నట్లు. ఎందుకంటే మన అవసరాలను తను చూసుకుంటుంది కాబట్టి. ఆమెకు ఎదైనా హెల్త్ ఎమర్జెన్సీ సంభవిస్తే ఆ పరిస్థితుల నుంచి గ ట్టెక్కడానికి ఆరోగ్య బీమా తప్పనిసరి.
అత్యవసర బీమా: మహిళలకు మాత్రమే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి చికిత్సకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వీటికి సంబంధించి అత్యవసర బీమా పాలసీని తీసుకోవాలి.
వాహన బీమా: ఒకవేళ అమ్మ ఉద్యోగం చేస్తుంటే.. తనకు వాహనం ఉంటే.. వాహన బీమా తీసుకోవాలి.
ఇంటి బీమా: మహిళలు రకరకాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారు ఆర్థికంగా స్వతంత్రులుగా ఉండి, ఆర్థికపరమైన అంశాల్లో స్వీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. వారికి ఇంటి బీమాను కానుకగా ఇవ్వండి.
ట్రావెల్ ఇన్సూరెన్స్: ప్రస్తుతం మహిళలు ఉద్యోగం/వ్యాపారంలో భాగంగా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. కొందరు ఉల్లాసం, కొత్తదనం కోసం టూర్‌లకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా అమ్మ కూడా తరచూ విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటే.. ఆమెకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం. అది వారికి కొత్త ప్రదేశాల్లో అనుకోని పరిస్థితులు సంభవిస్తే.. రక్షణ కల్పిస్తుంది.
గృహిణైనా? ఉద్యోగిణైనా? బీమా తప్పనిసరి
భారత్‌లో బీమా వ్యాప్తి తక్కువే. బీమా పరిశ్రమ నివేదికల ప్రకారం.. బీమా తీసుకున్న వారిలో మహిళల వాటా 20-30 శాతం మాత్రమే. గతంలో కుటుంబంలోని మహిళకు ఎలాంటి ఆర్థికపరమైన బాధ్యతలు ఉండవనే కారణంతో వారికి బీమా ఎందుకని అనుకునేవారు. కానీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు వారూ బాధ్యతలను మోస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ బీమా దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి మార్పు లేదు. ఇది మారాలి. వారికి కూడా బీమా తీసుకోవాలి. కనీసం ఇంట్లో అమ్మకైనా బీమా ఇప్పించాలి. ఆమె గృహిణా? ఉద్యోగిణా? అనేది ఇక్కడ అనవసరం.
- పునీత్ సాహ్ని
హెడ్- ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్