వాషింగ్టన్, న్యూఢిల్లీ : అంగారక గ్రహం మీదకు యాత్రికులుగా వెళ్లి వచ్చేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. నాసా చేపట్టిన ఇన్‌సైట్ (ఇంటీరియర్ ఎక్లోరిషన్ యూజింగ్ సెస్మిక్ ఇన్వెస్టిగేషన్) మిషన్‌లోభాగంగా అంగారక గ్రహ ప్రయాణానికి 1,38,899 మంది తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని నాసా ధృవీకరించింది. ఈ మిషన్ 2018 మే 8న ప్రారంభం కానుంది. ప్రయాణానికి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులకు ఆన్‌లైన్‌లోనే బోర్డింగ్ పాస్‌లను జారీ చేస్తున్నట్లు నాసా తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్‌లో పాల్గొనేందుకు 24 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు నాసా తెలిపింది. అందులో 2,62752 మందిని ఎంపిక చేసినట్లు నాసా జెట్ ప్రాపల్సన్ లేబరేటరీ అధికారి అండ్రూ గుడ్ తెలిపారు.
ఈ మిషన్ మొత్తం 720 రోజుల పాటు కొనసాగుతుందని అండ్రూ గుడ్ తెలిపారు. అంగారకుడి భూ మధ్య రేఖ మీదుగా వెళ్లి.. అక్కడనుంచి అంగారకుడి భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా అంగారక భూ ఉపరితలంపై భూ కంపాలను అధ్యయనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంగారక గ్రహం నుంచి తిరిగి 2018 నవంబర్ 26 భూమికి తిరిగి వస్తామని అండ్రూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment