లండన్: మానవసహితంగా అరుణగ్రహంపైకి వెళ్లి తిరిగి రావడం సులువేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ సోలార్ విండ్ సెయిల్(ఈ-సెయిల్) పరికరం ద్వారా ఆస్టరాయిడ్స్‌పై ఉన్న నీటిని వాడుకోవడం వల్ల ఇంధనం లేకుండానే ఈ ప్రయాణం సాధ్యపడుతుందంటున్నారు.
2006లో అభివృద్ధి చేసిన ఈ-సెయిల్ ఉల్కలపై ఉన్న నీటిని కనిపెట్టి.. అక్కడికి మైనింగ్ చేసే యంత్రాన్ని పంపి నీటిని సేకరిస్తుంది. అక్కడి నీటిని ఆవిరి రూపంలో చల్లటి కంటెయినర్‌లోకి ఎక్కించి, పూర్తిగా నిండిన తర్వాత దీన్ని మార్స్ కక్ష్యలోకి కాని, భూ ఉపరితలంపైకి కాని పంపిస్తారు. అక్కడ ఈ ఆవిరిని ద్రవరూప హైడ్రోజన్, ద్రవరూప ఆక్సిజన్‌గా మార్చి ఇంధనంగా వినియోగిస్తారు.
మార్స్‌పైకి వెళ్లి.. రావచ్చు!
Published Wed, Apr 29 2015 1:50 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
Advertisement