నేను అరుణగ్రహంపై చిక్కుకుపోయాను. 987 రోజుల కిందట మంగల్యాన్ ద్వారా పంపిన ఆహారం అయిపోవస్తున్నది.
‘నేను అరుణగ్రహంపై చిక్కుకుపోయాను. 987 రోజుల కిందట మంగల్యాన్ ద్వారా పంపిన ఆహారం అయిపోవస్తున్నది. కాబట్టి మంగల్యాన్-2ను ఎప్పుడు పంపిస్తారు’ .. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్. ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే సుష్మాసర్వాజ్ ఎవరూ ఏ చిన్న సాయం కోరినా వెంటనే స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాను అరుణగ్రహంపై చిక్కుకుపోయానంటూ కాస్త వెటకారంతో చేసిన ఈ ట్వీట్‌కు ఆమె దీటైన సమాధానమే ఇచ్చింది. ‘అరుణగ్రహంపై మీరు చిక్కుకుపోయినా ఏం పర్వాలేదు. అక్కడే ఉన్న భారత రాయబారా కార్యాలయం మీకు సాయం అందిస్తుంది’ అంటూ చమత్కారించారు. వెటకారాన్ని అంతే ఘాటు వ్యంగ్యంతో సుష్మా తిప్పికొట్టిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సుష్మ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నారంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.
ట్విట్టర్‌లో నెటిజన్లు ఏ చిన్న సాయం కోరినా వెంటనే అందజేయడంలో సుష్మ ముందున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ కేంద్రమంత్రిగా ఉన్న ఆమెను ‘రాష్ట్రపతి’ని చేయాలంటూ ఇప్పుడు ఆమె అభిమానులు డిమాండ్ కూడా చేస్తున్నారు.