వాషింగ్టన్: అంగారక గ్రహం మీదకు తరచుగా పరిశోధనలకు వెళ్లే శాస్త్రజ్ఞులకు జ్ఞాపకశక్తిని కోల్పోయే ప్రమాదం ఉందా?. అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. 'స్పేస్ బ్రెయిన్' పేరుతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు అంగారక గ్రహంపై పరిశోధనల కోసం వెళ్లే శాస్త్రజ్ఞుల మెదళ్ల స్ధితిగతులను పరిశీలించారు.
ఫలితాలను చూసిన యూనివర్సిటీ పరిశోధకులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆరు నెలలకు పైగా అంగారక గ్రహం మీద గడిపిన శాస్త్రజ్ఞులకు అక్కడ ఉండే కాస్మిక్ కిరణాలకు వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశోధకులు జర్నల్ సైంటిఫిక్ రిపోర్టుల్లో ప్రచురించారు. స్కానింగ్ లో పరిశోధకుల మెదడు పనితనం మందగిస్తున్నట్లు తెలిసింది.
నాడీ కణాలు మెదడుకు సమాచారం అందజేయడంలో విఫలం చెందుతుండటం, మెదడు ఇచ్చే సంకేతాలను నాడీ కణాలు అడ్డుకుంటున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో వారిలో భయాందోళనలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే, అంతరిక్ష నౌకలకు షీల్డింగ్ ను పెంచడం వల్ల ఈ సమస్యను కొంతవరకూ నివారించుకోవచ్చని యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు.
శాస్త్రవేత్తలకు ఆ ప్రమాదం తప్పదా?
Published Tue, Oct 11 2016 9:55 AM | Last Updated on Mon, Sep 4 2017 4:59 PM
Advertisement
Advertisement