
వ్యోమగాములు లేకుండా!
అంతరిక్షంలోని సుదూర ప్రాంతాలకు, అప్పుడప్పుడు మార్స్ మీదకు వెళ్లడానికి అమెరికాకు చెందిన నాసా స్పేస్ లాంచ్ సిస్టం(ఎస్‌ఎల్‌ఎస్)ను ఏర్పాటు చేసింది.
వాషింగ్టన్: అంతరిక్షంలోని సుదూర ప్రాంతాలకు, అప్పుడప్పుడు మార్స్ మీదకు వెళ్లడానికి అమెరికాకు చెందిన నాసా స్పేస్ లాంచ్ సిస్టం(ఎస్‌ఎల్‌ఎస్)ను ఏర్పాటు చేసింది. దీన్ని ఓరియన్ అని కూడా అంటారు.
అయితే మొట్టమొదటగా లాంచ్ చేసే ఎస్‌ఎల్‌ఎస్‌లో మానవులను పంపబోవడం లేదని నాసా తెలిపింది. ఫిబ్రవరిలో నాసా ఇందులో మనుషులను పంపే అంశంపై ఆలోచించడం ప్రారంభించింది. అయితే రకరకాల పరిశోధనలు చేసిన అనంతరం మనుషులు లేకుండానే పంపించాలని నిర్ణయించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది.