నాసా ఇన్సైట్ ప్రయోగం వాయిదా | NASA suspends 2016 launch of Mars lander | Sakshi
Sakshi News home page

నాసా ఇన్సైట్ ప్రయోగం వాయిదా

Published Wed, Dec 23 2015 11:07 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

NASA suspends 2016 launch of Mars lander

వాషింగ్టన్: అరుణ గ్రహం(మార్స్) మీద ప్రయోగానికి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా తలపెట్టిన 'ఇన్సైట్' ప్రయోగం వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని 2016 మార్చిలో నిర్వహించాలని భావించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల దృష్ట్యా ప్రయోగాన్ని నిర్వహించడం కుదరదని భావించి వాయిదా వేస్తున్నట్లు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ గ్రన్స్ఫెల్డ్ మంగళవారం ప్రకటించారు.

ఇన్సైట్ ప్రయోగంలో కీలకమైన సిస్మిక్ మీటర్లో ఏర్పడిన లీక్ ఫలితంగా ఈ ప్రయోగం వాయిదా పడినట్లు నాసా వర్గాలు తెలిపాయి. ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ తయారు చేసిన ఈ పరికరానికి పలుమార్లు మరమ్మతులు నిర్వహించినా తాజాగా మరోసారి మొరాయించడంతో ప్రయోగాన్ని వాయిదా వేయక తప్పలేదని తెలిపారు. ఈ వాయిదాతో భూమీ, అంగారకుని స్థానాల దృష్ట్యా మరో 26 నెలల వరకు ఈ ప్రయోగం నిర్వహించడం కుదరదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement