ఆశ్చర్యంగా ఉందా? మనిషే అడుగు పెట్టని అంగారక గ్రహం (మార్స్)పైకి అప్పుడే లక్షమంది భారతీయులు ఎలా వెళ్లగలిగారు? అని ముక్కున వేలేసుకుంటున్నారా?.... కాస్త ఆగండి. నాసా ప్రయోగించిన ఇన్ సైట్ ప్రోబ్ అంగారక గ్రహంపైకి చేరింది కదా. దాంతోపాటే లక్షా 39 వేల 899 మంది భారతీయుల పేర్లు కూడా ఆ గ్రహంపైకి చేరాయి. అదీ సంగతి. ఎలక్ట్రాన్ బీమ్ సాయంతో పలుచటి సిలికాన్ పొరపై వీరందరి పేర్లు ముద్రించి, దానిని ఇన్‌సైట్ ల్యాండర్ పైభాగంలో బిగించారు. మనిషి వెంట్రుక మందంలో వేల వంతులు తక్కువ సైజున్న అక్షరాలతో ఈ పేర్లను ముద్రించడం విశేషం. నాసా పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24,29,807 మంది తమ పేర్లు పంపారు. అమెరికా నుంచి 6.76 లక్షలు, చైనా నుంచి 2.62 లక్షల మంది తమ పేర్లు పంపగా భారత్ మూడోస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment