అంతరిక్షంలో 522 రోజులు | Scott Kelly become longest-serving US astronaut in space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో 522 రోజులు

Published Sat, Oct 17 2015 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

అంతరిక్షంలో 522 రోజులు

అంతరిక్షంలో 522 రోజులు

- అంతరిక్షంలో అరుదైన రికార్డు
- అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మానవుడిగా స్కాట్ కెల్లీ
- మార్స్ మీదికి మనిషిని పంపే దిశగా... నాసా ప్రయోగాలు

వాషింగ్టన్ :అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.  శనివారంతో ఆయన స్పేస్ స్టేషన్ లో 383 రోజులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు అమెరికన్ వ్యోమగామి.. మైక్ ఫింక్స్ పేరిట ఉంది.


కాగా.. ఈనెల 29న స్కాట్ కెల్లీ మరో మైలు రాయిని చేరుకోనున్నాడు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు సాధించనున్నాడు. ఐఎస్ఎస్ లో 45 మంది సభ్యుల బృందానికి కమాండర్ గా వ్యవహరిస్తున్న కెల్లీ ఒకే విడతలో 216 రోజుల పాటు స్పేస్ స్టేషన్ లో గడిపిన రికార్డు బద్దలు కొట్టనున్నాడు. మరో వైపు ఈనెల 29న ఐఎస్ఎస్ అంతరిక్షంలో పని ప్రారంభించి 15 వసంతాలు పూర్తి చేసుకుంటుంది.


అరుదైన ప్రయోగం కోసం
స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు. అంతే కాదు.. ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు.


స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చని నాసా అభిప్రాయపడుతోంది. మార్స్ మీదికి మనిషిని పంపేందుకు ఉపయోగపడతాయని యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. కెల్లీ రికార్డు కేవలం వ్యక్తిగతమైనది కాదని ...ఈ పరిశోధన అంతరిక్షంలో మానవ మనుగడ సాధ్యాసాధ్యాల పరిశోధనలో అరుదైన మైలు రాయని నాసా తెలిపింది.


కెల్లీ అంతరిక్షంలో గడిపే ప్రతి గంటకూ ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంది. ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని.. తెలియజేసింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది. స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్ వచ్చే ఏడాది మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు. అప్పటికి 522 రోజులు పూర్తి కానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement