ఐఎస్‌ఎస్‌కు పంపించనున్న నాసా
న్యూఢిల్లీ: భారత్, అమెరికా ఉమ్మడిగా అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే దిశగా ముందడుగు పడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ప్రయోగంలో పాలుపంచుకొనేందుకు ‘గగనయాన్’ మిషన్ వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రయోగం కోసం నలుగురు వ్యోమగాములు శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే.
వీరిలో ఒకరిని ఐఎస్‌ఎస్‌కు పంపిచనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అమెరికాలో పర్యటించారు. ఉమ్మడి అంతరిక్ష ప్రయోగాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చర్చించారు. ఉమ్మడి స్పేస్ మిషన్లలో భాగంగా 2024లో భారత వ్యోమగామిని ఐఎస్‌ఎస్‌కు పంపిస్తామని బైడెన్ ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు గగన్‌యాన్ మిషన్ కోసం భారత వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాములకు ప్రస్తుతం బెంగళూరులోని ఇస్రో అస్ట్రోనాట్స్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment