Scott Kelly
-
ఒకరు అంతరిక్షంలో.. ఒకరు అవనిపై..
వాషింగ్టన్: స్కాట్ కెల్లీ, మార్క్‌లు ఇద్దరూ కవలలు.. ఇద్దరి శరీర తీరు, ఆకారం, జన్యువులు దాదాపు ఒకేరకంగా ఉన్నాయి. ఒకవ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లాడు. 340 రోజుల పాటు అక్కడే గడిపాడు. మరొకరేమో భూమిపైనే ఉన్నాడు. సాధారణంగా మనలాగే ఇక్కడ గడిపాడు. ఈ ఏడాది పాటు వారిద్దరి శరీరంలో, జన్యు క్రమంలో జరిగిన మార్పులేంటి.. కెల్లీ భూమిపైకి వచ్చాక తిరిగి యథాస్థితికి వచ్చారా అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఇద్దరు కవలలపై పరిశోధనలు చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. యూరీ గెగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి 58 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ పరిశోధన వివరాలను శుక్రవారం నాసా తెలిపింది. ఏడాది పాటు మానవుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనుగడ సాగించగలడని చివరికి శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2015–16 మధ్య స్కాట్ కెల్లీ అంతరిక్షంలో 340 రోజుల పాటు జీవనం సాగించారు. అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం, గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల మన శరీరంలో కొన్ని మార్పులు జరిగి ఆ వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంటుందని నాసాకు చెందిన స్టీవెన్ ప్లాట్స్ వివరించారు. శరీర బరువు, సూక్ష్మజీవులు, రక్తప్రసరణ, కొల్లాజెన్‌లో మార్పులు, ముఖ్యంగా జన్యువుల్లో అస్థిరత, రోగ నిరోధక శక్తి తదితర మార్పులు స్కాట్ కెల్లీలో సంభవించినట్లు తెలిపారు. అయితే భూమి మీదకు వచ్చాక కెల్లీ శరీరంలో సంభవించిన మార్పులన్నీ యథాస్థితికి వచ్చి, కవల సోదరుడి మాదిరిగానే మారిపోయినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 యూనివర్సిటీలకు చెందిన 84 మంది శాస్త్రవేత్తలు 10 బృందాలుగా విడిపోయి అంతరిక్షంలో మానవ శరీరంలో జరిగే మార్పులను చాలా క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అంతరిక్షంలో ఉన్న స్కాట్ కెల్లీ, భూమిపై ఉన్న మార్క్‌ల శారీరక, మానసిక మార్పులను తెలుసుకునేందుకు 27 నెలల పాటు వారి ప్లాస్మా, రక్తం, మల, మూత్రాల నమూనాలను అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములకు∙చికిత్స అందించేందుకు వీలు కలగనుంది. కెల్లీలో మార్పులివీ.. ► అంతరిక్షంలోకి చేరుకోగానే దాదాపు వెయ్యి జన్యువుల్లో మార్పులు ► కెరోటిడ్ ధమని దళసరిగా మారింది ► డీఎన్ఏకు నష్టం వాటిల్లింది ► జన్యువుల్లో మార్పులు సంభవించాయి ► కంటి రెటీనా మందంగా మారింది ► కడుపులోని బ్యాక్టీరియా స్థానాన్ని మార్చుకున్నాయి ► మేధస్సులో మార్పులు ► టీలోమర్లలో నిర్మాణాత్మక మార్పులు ► డీఎన్ఏలో జన్యుపరివర్తనం జరగలేదు ► ఫ్లూ వ్యాక్సిన్ భూమిపైలాగే పనిచేసింది ► వ్యాయామంతో బరువు తగ్గాడు ► ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడే ఫోలిక్ యాసిడ్ పెరిగింది ► చురుగ్గా రోగ నిరోధక శక్తి -
నేలను తాకి ఎన్నాళ్లయింది..!
డెకాగన్: అంగారక గ్రహాంపైకి మానవుణ్ని పంపేందుకు నాసా ఆధ్వర్యంలో పలు దేశాలు సంయుక్తంగా తలపెట్టిన మిషన్ టు మార్స్ ప్రయోగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్స్ యాత్రకు వెళ్లలాంటే వ్యోమగాలు సుదీర్ఘకాలంపాటు అంతరీక్షంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అసలు మనిషి స్పేస్ లో అంతకాలం ఉండగలడా? అందుకు వాతావరణం, శరీరం సహకరిస్తుందా? అనే కోణంలో చేపట్టిన ప్రయోగాలు.. స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియాంకోల రాకతో సఫలమైనట్లు తేటతెల్లమైంది. మిషన్ టు మార్స్ లో భాంగా ఏడాది పాటు అంతరీక్షంలో గడిపిన అమెరికన్, రష్యన్ వ్యోమగాములు స్కాట్ కెల్లీ, మిఖాయెల్ కొర్నియోంకోలు బుధవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమిని చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి స్పేస్ షటిట్ లో బయలుదేరిన ఆ ఇద్దరూ కజకిస్థాన్ లోని డెకాగన్ శాటిలైట్ సెంటర్ వద్ద విజయవంతంగా భూమిపై పాదం మోపారు. అత్యధికా కాలం ఐఎస్ఎస్ లో గడిపిన రికార్డు వీరిద్దరే కావటం గమనార్హం. స్కాట్, మిఖాయెల్ ల రాకతో నాసా సహా మిషన్ టు మార్స్ లో భాగస్వామ్యదేశాల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. 345 రోజులపాటు అంతరీక్షంలో గడిపిన స్కాట్.. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్ లో పోస్టులు పెట్టేవారు. వాటిని నెటిజన్లు కూడా అద్భుతంగా ఆదరించారు. ఇటీవలే గొరిల్లా సూట్ లో ఐఎస్ఎస్ లో సందడి చేస్తూ స్కాట్ పెట్టిన పోస్టుకు విపరీతమైన స్సదన వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి 27న స్కాట్, మిఖాయెల్ లు అంతరీక్ష కేంద్రానికి వెళ్లారు. -
అంతరిక్షంలో వ్యోమగామి వెంటపడ్డ గొరిల్లా
అంతరిక్షంలోకి కుక్కలు వెళ్లడం మనకు తెలుసు కానీ ఈమధ్య గొరిల్లాలు కూడా వెళుతున్నాయా? అంటే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో అవుననే అంటుంది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఓ గొరిల్లా ప్రత్యక్షమవ్వడమే కాదు.. ఏకంగా ఓ వ్యోమగామిని వెంటపడి తరిమింది. అంతరిక్ష కేంద్రంలో ఒక్కసారిగా గొరిల్లాను చూసి కంగుతిన్న ఆ వ్యోమగామి బిత్తరపోవడమే కాదు.. భయంతో పరుగులు కూడా పెట్టాడు. ఇంతకు ఆ గొరిల్లా అంతరిక్ష కేంద్రంలోకి ఎలా వచ్చింది? వ్యోమగామిని ఎందుకు తరిమింది? అంటే దానికి వెనుక మరో వ్యోమగామి చిలిపి పని.. సహచర అంతరిక్ష యాత్రికుడ్రిని టీజ్ చేయాలన్న కొంటె ఆలోచన దాగి ఉంది. అమెరికాకు చెందిన వ్యోమగామి స్కాట్ కెల్లీ అంతరిక్షంలోని ఐఎస్ఎస్లోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. మార్చి మొదటి వారంలో అతను భూమికి తిరిగి రావాలి. వెళ్లేముందు ఏదో ఒక తుంటరి పని చేసి అంతరిక్ష కేంద్రంలో ఉన్న తన తోటి మిత్రులను ఆటపట్టించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గొరిల్లా అవతారమెత్తాడు. అంతరిక్ష కేంద్రంలోని జీరో గ్రావిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. గొరిల్లా వేషం కట్టిన స్కాట్ కెల్లీ ఒక తెల్ల డబ్బానుంచి బయటకు వచ్చి గాల్లో తేలుతూ బ్రిటిష్ ఆస్ట్రోనాట్ టిమ్ పీక్ వెంటపడ్డాడు. అతనేమో నిజంగానే గొరిల్లా వచ్చిందనుకుని దాన్నుంచి తప్పించుకునేందుకు తెగ తంటాలు పడ్డాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోంది. గొరిల్లా సూట్‌ను స్కాట్ సోదరుడు మార్క్ అంతరిక్ష కేంద్రానికి పంపాడు. ఈ వీడియోను మొదట పోస్ట్ చేసింది కూడా అతనే. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉన్న అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీనే. -
అంతరిక్షంలో 522 రోజులు
- అంతరిక్షంలో అరుదైన రికార్డు - అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మానవుడిగా స్కాట్ కెల్లీ - మార్స్ మీదికి మనిషిని పంపే దిశగా... నాసా ప్రయోగాలు వాషింగ్టన్ :అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. శనివారంతో ఆయన స్పేస్ స్టేషన్ లో 383 రోజులు పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు అమెరికన్ వ్యోమగామి.. మైక్ ఫింక్స్ పేరిట ఉంది. కాగా.. ఈనెల 29న స్కాట్ కెల్లీ మరో మైలు రాయిని చేరుకోనున్నాడు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడిపిన వ్యక్తిగా కూడా ఆయన గుర్తింపు సాధించనున్నాడు. ఐఎస్ఎస్ లో 45 మంది సభ్యుల బృందానికి కమాండర్ గా వ్యవహరిస్తున్న కెల్లీ ఒకే విడతలో 216 రోజుల పాటు స్పేస్ స్టేషన్ లో గడిపిన రికార్డు బద్దలు కొట్టనున్నాడు. మరో వైపు ఈనెల 29న ఐఎస్ఎస్ అంతరిక్షంలో పని ప్రారంభించి 15 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అరుదైన ప్రయోగం కోసం స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు. అంతే కాదు.. ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు. స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చని నాసా అభిప్రాయపడుతోంది. మార్స్ మీదికి మనిషిని పంపేందుకు ఉపయోగపడతాయని యూఎస్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. కెల్లీ రికార్డు కేవలం వ్యక్తిగతమైనది కాదని ...ఈ పరిశోధన అంతరిక్షంలో మానవ మనుగడ సాధ్యాసాధ్యాల పరిశోధనలో అరుదైన మైలు రాయని నాసా తెలిపింది. కెల్లీ అంతరిక్షంలో గడిపే ప్రతి గంటకూ ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొంది. ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని.. తెలియజేసింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది. స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్ వచ్చే ఏడాది మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు. అప్పటికి 522 రోజులు పూర్తి కానున్నాయి. -
అంతరిక్షంలో ప్రీమియర్
సినిమా రిలీజ్ కాక ముందు ప్రముఖులకు ప్రీమియర్ షోస్ వేయడం సాధారణం. ఇప్పుడు తొలిసారిగా ఓ చిత్రాన్ని ఏకంగా అంతరిక్షంలోని ‘ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్’లో ప్రదర్శించారు. అదే ‘ద మార్షియన్’. అంగారక గ్రహంపై చిక్కుకున్న వ్యోమగామి చుట్టూ తిరిగే కథాంశంతో మాట్ డామన్ హీరోగా ‘గ్లాడియేటర్’ ఫేమ్ రిడ్లీ స్కాట్ దీన్ని తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రాన్ని ఇటీవలే చూశా. చాలా బాగుంది’’ అని ఆ స్పేస్‌స్టేషన్ నుంచే స్కోట్ కెల్లీ అనే వ్యోమ గామి ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ప్రీమియర్ సంచలనమైంది.