Rare Planetary Conjunction: Mars And Venus Set To Align With Moon Today - Sakshi
Sakshi News home page

నేడు ఆకాశంలో అద్భుతం..ఇలా చూసేయండి..!

Published Mon, Jul 12 2021 7:05 PM | Last Updated on Mon, Jul 12 2021 8:02 PM

Mars Venus To Align With Moon Today - Sakshi

బెంగళూరు: గతంలో  గురు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గ్రేట్‌ కంజక్షన్‌ భూమిపై ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంది. కాగా ఈసారి ఆకాశంలో నేడు మరో అద్బుత దృశ్యం ఆవిష్కృతంకానుంది.  అంగారక,  శుక్ర గ్రహాలు  ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చంద్రుడితో కలిసి కనిపించనున్నాయి. భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడవచ్చును. ఖగోళ పరిశోధకుల ప్రకారం.. శుక్ర గ్రహం, మార్స్ దగ్గరగా రావడం మొదటిసారి. అంగారక గ్రహం (మార్స్), శుక్ర (వీనస్) గ్రహాలు ఫిబ్రవరి 12, 2022, మార్చి 12, 2022 న మరోసారి దగ్గరగా రానున్నాయి.


జూలై 12 , 13 తేదీలలో అంగారక గ్రహం, శుక్రుడు భూమి నుంచి ఒకదానికొకటి కేవలం 0.5 డిగ్రీల తేడాతో కనిపిస్తారు.  జూలై 12 న రెండు గ్రహాలతో 4 డిగ్రీల కోణంలో చంద్రుడు సమాంతరంగా రానున్నాడు. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం ఈ ఖగోళ ఈవెంట్‌ను నేరుగా  కంటితో చూడవచ్చునని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సూర్యాస్తమయం తరువాత  భారత్‌లో ఎక్కడైనా నేరుగా చూడవచ్చును.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement