Venus planet
-
శుక్రయాన్‌కు పేలోడ్లు సిద్ధం
న్యూఢిల్లీ: చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదిత్యయానం కొనసాగుతోంది. ఇక శుక్ర గ్రహంపై జెండా పాతేందుకు భారత్ సిద్ధమవుతోంది. శుక్ర యాత్రకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు. దానికి సంబంధించిన పేలోడ్లు ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన బుధవారం వివరించారు. శుక్రుని అధ్యయనం భూగోళం భవితవ్యానికి సంబంధించి కీలక సమాచారం అందజేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకట్రెండేళ్లు పట్టవచ్చు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెర తీశాయి. -
అరుదైన ఘటన.. అతి సమీపానికి గురుశుక్రులు..ఏ రోజున అంటే..
న్యూయార్క్: గురు, శుక్ర గ్రహాలు పరస్పరం అత్యంత సమీపానికి రానున్నాయి. ఈ అరుదైన ఘటన మార్చి 1వ తేదీన కనువిందు చేయనుంది. ఆ రాత్రి భూమి నుంచి చూస్తే అవి రెండూ దాదాపు ఒకదాన్నొకటి ఆనుకున్నంత దగ్గరగా కన్పిస్తాయి! నిజానికవి ఎప్పట్లాగే పరస్పరం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాకపోతే సూర్యుని చుట్టూ వాటి పరిభ్రమణ క్రమంలో భాగంగా భూమి నుంచి చూసేవాళ్లకు మాత్రం ఆ రోజు పరస్పరం అత్యంత దగ్గరగా వచ్చినట్టు కన్పిస్తాయన్నమాట. దీన్ని మామూలు కళ్లతోనే చూడొచ్చు. సౌరమండలంలో సూర్యచంద్రుల తర్వాత అత్యంత ప్రకాశవంతమైనది శుక్రుడే. భూమికి అత్యంత సమీపంలో ఉండటంతో అప్పుడప్పుడూ పగటి పూటా కనిపిస్తుంటుంది! -
నేడు ఆకాశంలో అద్భుతం..ఇలా చూసేయండి..!
బెంగళూరు: గతంలో గురు, శని గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ అరుదైన గ్రేట్ కంజక్షన్ భూమిపై ఎంతోమంది చూపరులను ఆకట్టుకుంది. కాగా ఈసారి ఆకాశంలో నేడు మరో అద్బుత దృశ్యం ఆవిష్కృతంకానుంది. అంగారక, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చంద్రుడితో కలిసి కనిపించనున్నాయి. భారత్‌లో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఖగోళ దృగ్విషయాన్ని చూడవచ్చును. ఖగోళ పరిశోధకుల ప్రకారం.. శుక్ర గ్రహం, మార్స్ దగ్గరగా రావడం మొదటిసారి. అంగారక గ్రహం (మార్స్), శుక్ర (వీనస్) గ్రహాలు ఫిబ్రవరి 12, 2022, మార్చి 12, 2022 న మరోసారి దగ్గరగా రానున్నాయి. జూలై 12 , 13 తేదీలలో అంగారక గ్రహం, శుక్రుడు భూమి నుంచి ఒకదానికొకటి కేవలం 0.5 డిగ్రీల తేడాతో కనిపిస్తారు. జూలై 12 న రెండు గ్రహాలతో 4 డిగ్రీల కోణంలో చంద్రుడు సమాంతరంగా రానున్నాడు. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం ఈ ఖగోళ ఈవెంట్‌ను నేరుగా కంటితో చూడవచ్చునని పేర్కొంది. వాతావరణం అనుకూలిస్తే సూర్యాస్తమయం తరువాత భారత్‌లో ఎక్కడైనా నేరుగా చూడవచ్చును. -
అక్కడ జీవం ఉండేందుకు అవకాశం
లండన్: అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా.. సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు మనగల అవకాశం ఉందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరపి లేని ప్రయోగాలు చేస్తుంటారు. అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుపుతున్నాయి. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్ అణువులు ఉన్నట్టు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రుడిపై ఫాస్పైన్ ఉందంటే.. సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. నిపుణుల బృందం చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్ డెక్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో వీరు ఫాస్ఫైన్ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది. పాస్ఫైన్‌కు మండే స్వభావం ఉంటుంది. (చదవండి: వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!) అయితే మరొ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పాస్ఫిన్ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేం. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చు’ అని తెలిపారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. -
శుక్రుడిపై ఒకప్పుడు నివాస పరిస్థితులు!
వాషింగ్టన్: శుక్రుడిపై ఒకప్పుడు నివాస పరిస్థితులు నెలకొని ఉన్నాయా? ఉండవచ్చనే అంటున్నారు అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు. శుక్రుడిపై నెలకొన్న 200 కోట్ల సంవత్సరాల వరకు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉందని వారు తెలిపారు. ఓ కంప్యూటర్ ద్వారా వివిధ గ్రహాల పూర్వ, భవిష్యత్ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం... శుక్రుడిపై ప్రస్తుతం భూమి కంటే 90 రెట్లు అధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉంది. తేమ కొంచెం కూడా లేదు. ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీలకు చేరింది. భూమి, శుక్రుడు దాదాపు ఒకే రకమైన పదార్థాలతో తయారయ్యాయి. 80వ దశకంలో నాసా పయోనీర్ ద్వారా శుక్రుడిపై చేసిన పరిశోధనల ప్రకారం ఒకప్పుడు అక్కడ సముద్రం ఉండే అవకాశం ఉంది. సూర్యుడికి భూమి కంటే దగ్గరగా ఉండటం వల్ల నీరు ఎండిపోయి ఉంటుందని భావిస్తున్నారు.