న్యూఢిల్లీ: చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయింది. ఆదిత్యయానం కొనసాగుతోంది. ఇక శుక్ర గ్రహంపై జెండా పాతేందుకు భారత్ సిద్ధమవుతోంది. శుక్ర యాత్రకు ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తవుతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
దానికి సంబంధించిన పేలోడ్లు ఇప్పటికే సిద్ధమైనట్టు ఆయన బుధవారం వివరించారు. శుక్రుని అధ్యయనం భూగోళం భవితవ్యానికి సంబంధించి కీలక సమాచారం అందజేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ ప్రయోగానికి ఇంకా ఒకట్రెండేళ్లు పట్టవచ్చు. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే శుక్రయానాలకు తెర తీశాయి.
Comments
Please login to add a commentAdd a comment