వాషింగ్టన్: శుక్రుడిపై ఒకప్పుడు నివాస పరిస్థితులు నెలకొని ఉన్నాయా? ఉండవచ్చనే అంటున్నారు అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు. శుక్రుడిపై నెలకొన్న 200 కోట్ల సంవత్సరాల వరకు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉందని వారు తెలిపారు. ఓ కంప్యూటర్ ద్వారా వివిధ గ్రహాల పూర్వ, భవిష్యత్ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం... శుక్రుడిపై ప్రస్తుతం భూమి కంటే 90 రెట్లు అధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉంది.
తేమ కొంచెం కూడా లేదు. ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీలకు చేరింది. భూమి, శుక్రుడు దాదాపు ఒకే రకమైన పదార్థాలతో తయారయ్యాయి. 80వ దశకంలో నాసా పయోనీర్ ద్వారా శుక్రుడిపై చేసిన పరిశోధనల ప్రకారం ఒకప్పుడు అక్కడ సముద్రం ఉండే అవకాశం ఉంది. సూర్యుడికి భూమి కంటే దగ్గరగా ఉండటం వల్ల నీరు ఎండిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
శుక్రుడిపై ఒకప్పుడు నివాస పరిస్థితులు!
Published Sat, Aug 13 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
Advertisement