
ఏఐ ఆర్టిస్ట్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు... అన్నట్లుగా తయారైంది పరిస్థితి. సదరు నౌఫాల్ ఆనే ఏఐ ఆర్టిస్ట్ తన ఆర్ట్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను అమెరికా నుంచి ముంబైకి తీసుకువచ్చి ఛాయ్‌వాలాగా మార్చాడు. ఈ ‘చాయివాలా–ఎలాన్ మస్క్’ ఇమేజ్ అంతర్జాల లోకంలో తెగ వైరల్ అయింది. ట్విట్టర్‌లో వేగంగా రెండు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
అంతర్జాల లోకవాసులు ఒకరిని మించి ఒకరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎలాన్... ఏమైనా చేయగలడు!’, ‘ఏఐ టెక్నాలజీతో గరం ఛాయ్ తయారుచేస్తున్నాడు!’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. మరో ఏఐ ఆర్టిస్ట్ ఎలాన్‌ను ఏకంగా బేబీగా మార్చేశాడు.
‘బ్రేకింగ్‌న్యూస్: ఎలాన్ మస్క్ యాంటీ ఏజీంగ్ ఫార్ములాపై పనిచేస్తున్నాడు. దాని ఫలితమే ఈ ఫొటో’ అనే కాప్షన్ ఆకట్టుకుంటోంది. ‘మార్స్ పైకి వెళ్లడానికి మస్క్‌కు ఇప్పుడు బోలెడు సమయం దొరికింది’... అని ఒకరు కామెంట్ పెట్టారు.