సైడింగ్ స్ప్రింగ్ సైజు పావు కిలోమీటరే!
ఆదివారం అంగారకుడిని దాటిపోయిన సైడింగ్ స్ప్రింగ్(సీ/2013 ఏ1) తోకచుక్క ఫొటోలివి. మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన మార్స్ ఉపరితల పరిశీలన ఉపగ్రహం(ఎంఆర్‌వో) ఆదివారం ఈ ఫొటోలను తీసింది. ఒక పిక్సెల్‌కు 138 మీటర్ల రెసొల్యూషన్‌తో 1.38 లక్షల కి.మీ. దూరం నుంచి ఎంఆర్‌వో వీటిని క్లిక్‌మనిపించింది.
దీంతో ఇంతకుముందు భావించినట్లుగా ఈ తోకచుక్క తలభాగం కిలోమీటరు సైజు లేదని, పావు కి.మీ. మాత్రమే ఉందని తేలింది. అలాగే ఈ తోకచుక్కను అన్నింటికంటే ముందుగా మార్స్‌పై ఉన్న నాసా ఆపర్చునిటీ రోవర్ ఫొటో తీసింది. సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన ఓ తోకచుక్కను ఇతర గ్రహంపై నుంచి ఫొటో తీయడం ఇదే తొలిసారి.