అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం | NASA Satellite Captures Japan's 'Moon Sniper' | Sakshi
Sakshi News home page

అల్లదివో.. ‘మూన్ స్నైపర్’ ఫోటోలు తీసిన ‘నాసా’ ఉపగ్రహం

Jan 27 2024 1:09 PM | Updated on Jan 27 2024 1:23 PM

NASA Satellite Captures Japan moon Sniper - Sakshi

జపాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగకముందు, దిగిన తర్వాత ‘క్లిక్’మనిపించిన ‘నాసా’ ఉపగ్రహం. ‘నాసా’ ఉపగ్రహం ‘లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్’ (LRO) ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ పరిశోధనలు చేస్తోంది. ఈ నెల 19న జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ జాబిలిపై దిగింది. అనంతరం ఐదు రోజులకు అంటే ఈ నెల 24న ‘నాసా’ ఆర్బిటర్... ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రాంతం మీదుగా ప్రయాణించింది. ఆ సందర్భంగా జాబిలి ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తు నుంచి జపాన్ ‘స్లిమ్’ ల్యాండర్ ఛాయాచిత్రాలను LRO తన కెమెరాలో బంధించింది.

‘నాసా’ శుక్రవారం వాటిని విడుదల చేసింది. ఓ చిన్న చుక్కగా ల్యాండర్ ఈ ఫొటోల్లో దర్శనమిస్తోంది. చంద్రుడిపై 13.3160 డిగ్రీల దక్షిణ అక్షాంశ, 25.2510 తూర్పు రేఖాంశ ప్రదేశంలో, మైనస్ 912 మీటర్ల (మైనస్ 2,992 అడుగుల) ఎలివేషన్లో ‘మూన్ స్నైపర్’ దిగింది. ఈ మైనస్ ఎలివేషన్ అనేది జాబిలిపై నిమ్న ప్రదేశాన్ని సూచిస్తుంది. ఎందుకంటే.. చంద్రుడి ఉపరితలం కంటే దిగువన షియోలీ బిలం (భారీ గుంత) వాలులో ‘మూన్ స్నైపర్’ దిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement