వాషింగ్టన్: చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తవుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1968లో ‘అపోలో–11’ ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడిపైకి పంపింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చంద్రుడిపై వ్యోమగాములను పంపాలని నాసా నిర్ణయించింది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడమే నాసా లక్ష్యంగా పెట్టుకుంది.
దీనికోసం జపాన్ సహకారం కూడా తీసుకుంటోంది. నాసా చేపట్టే మూన్ ప్రాజెక్టులో భాగంగా జపాన్ వ్యోమగాములు కూడా చందమామపైకి వెళ్లనున్నారు. ఇందుకోసం జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జక్సా’ ఏర్పాట్లు చేస్తోంది. చందమామపై మళ్లీ కాలు పెట్టడం, జాబిల్లి చుట్టూ ఆర్బిటర్లు తిరిగే విషయంలో రెండు దేశాలూ భాగస్వామ్యం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment