మార్స్‌పై చారలు..!  | Rock stripes on Mars | Sakshi
Sakshi News home page

మార్స్‌పై చారలు..! 

Published Mon, Feb 19 2018 2:53 AM | Last Updated on Mon, Feb 19 2018 2:53 AM

Rock stripes on Mars - Sakshi

వాషింగ్టన్‌: అరుణగ్రహం (మార్స్‌)పై శోధించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన రోవర్‌ ఆపర్చునిటీ ఓ కొత్త విషయాన్ని గుర్తించింది. అక్కడ రాళ్లపై చారలను కనుగొంది. ఈ చారలకు భూమిపై ఉన్న కొన్ని పర్వతాలపై మట్టి తరచూ గడ్డకట్టడం, కరిగిపోవడం వల్ల ఏర్పడే చారలతో పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ చారలు కొన్నిసార్లు గాలి వీయడం, పై నుంచి నీరు పారడం వంటి కారణాలతో కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. ఈ రోవర్‌ 2004 జనవరిలో అరుణగ్రహంపై అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఇది 5 వేల అరుణగ్రహం రోజులను పూర్తి చేసుకుంది. అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఓ లోయలో అన్వేషణ సాగిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీకి చెందిన అర్వింద్‌సన్‌ రాయ్‌ తెలిపారు. ఈ లోయలో మట్టి, కొన్ని రాళ్లపై చారలు, ముడుతల వంటివి ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ లోయ ఎలా ఏర్పడిందనే విషయం ఇంకా తెలియదని పేర్కొన్నారు. ఈ చారలు కూడా ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు తమ బృందం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement