![NASA Mars Rover Sparks Global Debate On Aliens - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/1/Aliens.jpg.webp?itok=-sdKyz75)
నాసా పోస్టు చేసిన చిత్రం
సాక్షి, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో గ్రహాంతరవాసుల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇలాంటి తరుణంలో నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఫొటో సర్వత్రా చర్చకు దారి తీసింది. ఈజిప్టులోని మహిళా యోధురాలి విగ్రహం తల ఆకారంలో కనిపిస్తున్న ఓ రాయి చిత్రమది.
దీంతో ఏలియన్స్ ఇప్పటికే భూమిపై సంచరించడం ప్రారంభించాయనే వాదన మొదలైంది. భూమిపై ఎన్నో ఆవిష్కరణలు జరగాల్సిన ప్రదేశాల్లో ఈజిప్టు ముఖ్యమైనది. అక్కడ ఉన్న పిరమిడ్ల వంటి చరిత్రక ఆధారాలతో ఏలియన్స్‌పై ఎన్నో చిత్రాలూ వచ్చాయి. ప్రస్తుతం నాసా పోస్టు చేసిన చిత్రం ఈ మేరకు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment