వాషింగ్టన్ : అంగారకుడిపై గత నెలలో బలమైన సౌర తుపాను సంభవించినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని కారణంగా గ్రహంపై రేడియేషన్ స్థాయిలు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. ఈ సౌర తుపాను సమయంలో ఏర్పడిన కాంతి పుంజం నాసా ప్రయోగించిన ‘మావెన్ ఆర్బిటర్’గతంలో పరిశీలించిన కాంతి పుంజాల కంటే 25 రెట్లు ప్రకాశవంతమైనదని వివరించారు. మావెన్ ఆర్బిటర్ 2014 నుంచి అంగారక గ్రహ వాతావరణం.. సౌర గాలులకు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది.
ఈ రేడియేషన్ ప్రభావం రెండు రోజులకు పైగా కొనసాగినట్లు క్యూరియాసిటీ రోవర్‌లోని రేడియేషన్ అసెస్‌మెంట్ డిటెక్టర్ ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు. నాసా చేపట్టిన పలు ప్రయోగాలు సూర్యుడు, అంగారకుడిపై ఏర్పడే సౌర తుపానుల ప్రభావం వంటివి వాటిని అధ్యయనం చేస్తున్నాయని నాసా శాస్త్రవేత్త ఎల్సాయిడ్ తలాత్ తెలిపారు. వీటి ద్వారా సౌర తుపానులు అంగారకుడి వాతావరణంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవచ్చని అమెరికాలోని సౌత్‌వెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు డాన్ హాస్సెలర్ వివరించారు.