కొండచిలువ.. కోడిపెట్టలు.. | Python kills Hen | Sakshi
Sakshi News home page

కొండచిలువ.. కోడిపెట్టలు..

Published Fri, Aug 5 2016 3:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కొండచిలువ.. కోడిపెట్టలు.. - Sakshi

కొండచిలువ.. కోడిపెట్టలు..

ఇబ్రహీంపట్నం: ఓ కొండచిలువ ఇంట్లోకి దూరి రెండు కోడిపెట్టలను మింగేసింది. ఎటూ కదల్లేక దొరికిపోయింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పొన్నాల జగదీశ్ తల్లితో కలసి గ్రామ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు నిర్మించుకుని ఉంటున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. కొండచిలువ ఇంట్లోని ఒక గదిలోకి ప్రవేశించింది. అక్కడున్న రెండు కోడిపెట్టలను మింగింది. ఉదయం కోడి కనిపించకపోవడంతో జగదీశ్ తమ్ముడు రాజు వెతకసాగాడు. ఇంట్లోని ఓ మూలన కొండచిలువ ముడుచుకొని ఉండడాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. వారొచ్చి తొమ్మిది అడుగుల పొడవున్న కొండచిలువను చంపి, అది మింగిన కోడిని బయటకు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement