
ఎన్‌ఎన్ కాలనీలో కోడిని హతమారుస్తున్న నాగుపాము
కొత్తూరు: తమ కాలనీలోని కోళ్లను రాత్రివేళల్లో చంపేస్తున్న నాగుపామును మండలంలోని ఎన్‌ఎన్‌కాలనీ వాసులు సోమవారం హతమార్చారు. వారం రోజుల నుంచి రాత్రివేళల్లో నాగుపాము కోడిగూళ్లోకి చొరబడి రోజుకు రెండు నుంచి మూడు కోళ్లను పొట్టనపెట్టుకుంటోంది. ఆదివారం రాత్రి కాలనీలోని పి. రమణ ఇంటికి ఆనుకొని ఉన్న కోళ్లగూడిలోకి పాము చొరబడింది. కోళ్లు అరవడంతో అప్రమత్తమైన ఆయనతో పాటు పరిసర ప్రజలు నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగుపాము బుసలు కొట్టడం చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్టకేలకు నాగుపామును పట్టుకుని హతమార్చారు. అయితే అప్పటికే అది రెండు కోళ్లను చంపేసింది.
Comments
Please login to add a commentAdd a comment