కోడిని దొంగిలించాడన్న కేసులో ఓ యువకుడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. పోలీసుల దెబ్బలకు అతడి పరిస్థితి విషమంగా మారింది.
అచ్చంపేట రూరల్(మహబూబ్‌నగర్): కోడిని దొంగిలించాడన్న కేసులో ఓ యువకుడిపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. పోలీసుల దెబ్బలకు అతడి పరిస్థితి విషమంగా మారింది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ఆదర్శనగర్ కాలనీ వాసి వినోద్‌కుమార్ .. హైదరాబాద్‌లో టీటీసీ సెకండియర్ చదువుతున్నాడు. కోడిని దొంగిలించాడని మంగళవారం కానిస్టేబుళ్లు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. సృ్పహ కోల్పోయిన యువకుడిని పోలీసులే స్థానిక ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న బంధువులు పోలీసులను నిలదీశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని హైదరాబాద్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.