
సాక్షి, హైదరాబాద్ : మద్యం తాగిన మత్తులో కొంతమంది దారుణాలకు తెగబడుతుంటారు. ఇంకొంతమంది జుగుప్సాకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కేసముద్రంలో ఓ యువకుడు మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు యువకులు పీకలదాకా మద్యం తాగారు. పక్కనే చికెన్ షాపులో ఓ కోడిని కొనుక్కుని ఇంటికి బయల్దేరారు. మద్యం అతిగా సేవించడంతో సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్న ఇద్దరు యువకులు ఆర్వోబీ రోడ్డు సమీపంలో పడిపోయారు.
ఓ యువకుడు పూర్తిగా స్రృహ కోల్పోయాడు. మరో యువకుడు మాత్రం చేతిలో ఉన్న కోడి మెడ కొరికేసి, బతికున్న దాన్నే కొరుక్కుతిన్నాడు. ఈ తతంగాన్నంతా రోడ్డున వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియో చూపిన వారంతా వీడెంత తాగాడురా.. బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సదరు యువకుల వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment