కోడి పందేల అదుపునకు ఉమ్మడి ప్రణాళిక
Published Wed, Jan 4 2017 11:36 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
సంయుక్త తనిఖీ బృందాలతో నిరంతర పర్యవేక్షణ
మండల స్థాయి బృందాల్లో తహసీల్దార్, ఎస్సై, జంతు సంరక్షణ సభ్యులు
కలెక్టర్ మార్గదర్శకాలతో అత్యవసర ఆదేశాలు
అమలాపురం టౌన్ : సంక్రాంతి పండుగలకు కోడి పందేలు నిర్వహించవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటంతో పాటు కొన్ని మార్గదర్శకాలు కూడా సూచించింది. వాటి అమలుకు జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రంగంలోకి దిగారు. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేసే దిశగా జిల్లాలోని అన్ని మండలాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉమ్మడి ప్రణాళిక అమలుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే మండల స్థాయిల్లో కోడి పందేలను పూర్తిగా నిరోధించేందుకు తçహసీల్దార్, పోలీసు ఎస్సై, జంతు సంరక్షణ కోసం పాటు పడే స్వచ్ఛంద సంస్థలకు చెందిన ఓ ప్రతినిధితో కూడిన తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. కలెక్టర్ అత్యవసర ఆదేశాలతో జిల్లాలోని అన్ని మండలాల్లో బృందాల ఏర్పాటుకు బుధవారం నుంచి మండల స్థాయి రెవెన్యూ, పోలీసు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ బృందాలు ఈనెల 7వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ మండలంలోని అన్ని గ్రామాల్లో నిరంతం పర్యటించి పందేల అదుపునకు చర్యలు చేపడుతూనే ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఆర్డీవోలకు తద్వారా కలెక్టరేట్‌కు నివేదించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బృందాల విధులు ఇవీ..
l ఈ బృందాలు తొలుత ఆయా మండలాల్లో ఎక్కడెక్కడ కోడి పందేలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయో ఆ స్థలాలను గుర్తించాలి.
l గుర్తించిన స్థలాల్లో ఆంక్షలు ఉన్నా పందేలు నిర్వహించేందుకు పందెగాళ్లు కాలు దువ్వుతుంటే అలాంటి స్థలాల్లో 144 సెక్ష¯ŒS అమలు చేయాలి.
l మండలంలోని ప్రతి గ్రామంలో కోడి పందేల నిరోధంపై బృందం ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ జంతు సంరక్షణ చట్టాలపై అవగాహన, వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు.
l మండలంలో అనుమానిత కోడి పందేల స్థలాల వద్దకు బృందం వెళ్తున్నప్పుడు కొందరు కానిస్టేబుళ్లు, ఫొటో, వీడియో గ్రాఫర్లను విధిగా వెంట పెట్టుకుని వెళ్లాలి.
l పండుగలకు ముందు నుంచి అంటే ఏడో తేదీ నుంచి పండుగల తర్వాత ఈనెల 24వ తేదీ వరకూ ఈ బృందాలు పందేలపై నిఘా కొనసాగించాలి.
l పందేలకు సన్నాహాలు జరుగుతున్నా... పందేలు నిర్వహిస్తున్నా పోలీసు బందోబస్తుతో బృందం దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నారు.
Advertisement
Advertisement