బంగారు కోడిపెట్టతో యజమాని రాజు
బాంగారు కోడిపెట్ట!
నారాయణఖేడ్: బంగారు బాతు నిత్యం బంగారు గ్రుడ్లు పెట్టిన కథను మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ వార్తలోని కోడిపెట్ట కూడా అలాంటిదే! బంగారు గ్రుడ్లు కాదుగానీ నిజం గుడ్లనే నిత్యం పెడుతూ యజమానులకు కాసులు కురిపిస్తోంది. వివరాల్లోకి వెడితే..
మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం మన్సుర్‌పూర్ గ్రామానికి చెందిన అంతారం రాజు గత ఏడు నెలల క్రితం నారాయణఖేడ్‌లోని మంగళవారం సంతలో హన్మంత్‌రావుపేట గ్రామానికి చెందిన ఓ వద్దురాలివద్ద రెండు కోడిపెట్టలను కొనుగోలు చేశాడు. రెండు కోడిపెట్టలకు కలిసి రూ.610లు చెల్లించాడు. ఈ కోడిపెట్టలను ఇంటికి తీసుకొచ్చి పెంచుకోసాగాడు. కాగా ఇందులోని ఓ కోడిపెట్ట 40 రోజులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను తీసింది. జతగా ఉన్న మరో కోడిపెట్ట మాత్రం 211 రోజులుగా కోడిగ్రుడ్లు పెడుతూనే ఉంది!
కోళ్ళు సహజంగా నెల రోజులు 40 రోజులపాటు గ్రుడ్లు పెట్టి పొదుగుతాయి. పిల్లలు పెరిగి కాస్త పెద్దయ్యాక మళ్ళీ గ్రడ్లు పెట్టడం, పొదగడం జరుగుతుంది. కానీ ఈ కోడి మాత్రం ప్రకతికి బిన్నంగా రోజూ గ్రుడ్లు పెడుతుందని యజమాని రాజు సంతోషంగా చెప్పాడు.