
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
హైదరాబాద్: హైదరాబాద్లోని శివార్లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్(బర్డ్ ఫ్లూ)భయట పడింది. హయత్ నగర్ లోని ఓ కోళ్లఫాంలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణే ల్యాబ్ నిర్ధారించింది. కోళ్ల ఫారంలోని 80 వేల కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వ్యాధి సోకిన కోళ్లని ఈ రోజు అధికారులు చంపేయనున్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు .