
లక్ష కోళ్లకు బర్డ్‌ఫ్లూ
హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో ఉన్న ఓ కోళ్ల పారంలోని లక్ష కోళ్లకు బర్డ్‌ప్లూ సోకినట్లు సమాచారం. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లలో ఇప్పటికే 20 వేల కోళ్లు మృతి చెందాయి. కాగా, తొర్రూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఫారంలో మిగిలిన కోళ్లను చంపివేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, చనిపోయిన కోళ్లను కుప్పలుగా వేయడంతో వర్షం రావడంతో కొట్టుకుపోతున్నాయి. దీంతో కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు .