bird flu virus
-
Red Alert: బర్డ్ ఫ్లూ దెబ్బకి లక్షలాది కోళ్లు బలి
-
Bird Flu: కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయం..
-
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్‌లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్‌ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్‌ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్‌ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్‌ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్‌ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
నెల్లూరులో వేల సంఖ్యలో కోళ్ల మృతి.. చికెన్ షాపులు బంద్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు పశుసంవర్ధకశాఖ అధికారులు. వివరాల ప్రకారం.. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. ఇక, బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు. అలాగే, బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. -
Bird Flu: బర్డ్‌ఫ్లూతో 11 ఏళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక..
పారిస్: హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కంబోడియాకు చెందిన 11 ఏళ్ల బాలిక ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అన్ని దేశాలు బర్డ్‌ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఈ బాలిక ఫిబ్రవరి 16న తీవ్ర అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహించగా బర్డ్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 22న ప్రాణాలు కోల్పోయింది. అనంతరం బాలిక తండ్రి సహా ఆమెతో సన్నిహితంగా మెలిగిన 12 మంది నమూనాలను అధికారులు సేకరించారు. తండ్రికి కూడా పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. అయితే అతనిలో ఎలాంటి లక్షణాలు లేవు. మిగతావారి నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. వీరి పరిస్థితిపై కంబోడియా అధికారులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచూ సంప్రదింపులు జరుపుతోంది. కోళ్లు, ఇతర పక్షుల్లో మాత్రమే కన్పించే బర్డ్‌ఫ్లూ వైరస్ మనుషులకు అత్యంత అరుదుగా సోకుతుంది. ఈ వైరస్ సోకిన పక్షులతో మనుషులకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటేనే అది సోకే అవకాశముంది. అయితే బాలికకు, ఆమె తండ్రికి బర్డ్‌ఫ్లూ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కోళ్లు, పక్షులతో సన్నిహితంగా మెలిగారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే బాలిక నుంచే ఆమె తండ్రకి వైరస్ సోకిందా? అనే విషయంపై ఇప్పుడే ఎలాంటి అంచనాకు రాలేమని అధికారులు పేర్కొన్నారు. పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతన్నాయని, కొందరు మానవులకు కూడా ఈ వైరస్ వాపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అన్ని దేశాలు ఈ వైరస్‌పై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఈ వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని హెచ్చరించింది. చదవండి: టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య -
China: చైనాలో మరో వైరస్.. ప్రపంచంలోనే ఫస్ట్
బీజింగ్: కరోనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రాగన్ కంట్రీ చైనాను మరో వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. అయితే, సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది. బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మొదటిసారిగా 2002లో H3N8 వైరస్ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కానీ, తాజాగా మనుషులకు కూడా ఈ వైరస్ సోకడంతో ఆందోళన నెలకొంది. 🚨 China has recorded the first human infection with the H3N8 strain of bird flu — a four-year-old boy from central Henan province. https://t.co/W8wPNgNzMf — Byron Wan (@Byron_Wan) April 27, 2022 ఇది కూడా చదవండి: నార్త్ కొరియా కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ -
12 వేల బాతులను చంపేశారు!
అలప్పుజ: కేరళ వాసులను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. అలప్పుజ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా తకళి గ్రామపంచాయతీలోని 10వ వార్డులో మొత్తం 12,000 బాతులను చంపేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించి బర్డ్ ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం భోపాల్‌కు పంపించారు. మరోవైపు అలపుజ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు ముమ్మరం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. తకళి గ్రామ పంచాయతీలోని వార్డు నంబర్ 10లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడటంతో ఈ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా వైద్యాధికారులు ప్రకటించారు. ఇక్కడ వాహనాలు, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో బాతులు, కోళ్లు, పిట్టలు, పెంపుడు పక్షుల గుడ్లు, మాంసం అమ్మకాలు, పేడ వాడకంపై జిల్లా యంత్రాంగం నిషేధించింది. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. (Omicron Variant: తీవ్రతపై త్వరలో స్పష్టత!) తకళి పంచాయతీ 10వ వార్డులో కిలోమీటరు పరిధిలో పక్షులను చంపే ప్రక్రియను పూర్తి చేసి సురక్షితంగా పాతిపెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సహకారం అందించాలని, ఆ ప్రాంతంలో నిఘా పెట్టాలని స్థానిక పోలీసులను కోరారు. బర్డ్‌ఫ్లూ నిర్ధారిత ప్రాంతాల్లో పశుసంక్షేమ శాఖ.. రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ల ద్వారా ప్రజలకు నివారణ మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బర్డ్ ఫ్లూ నివారణ చర్యలపై రోజువారీ నివేదికలు అందజేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. (చదవండి: ఒమిక్రాన్ టెన్షన్.. 2 రోజుల పాటు కర్ఫ్యూ) -
Bird Flu Strain H10N3: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఆందోళన అక్కర్లేదు!
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ కారకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్జియాంగ్కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్‌ఫ్లూ వైరస్‌లోని హెచ్10ఎన్3 స్ట్రెయిన్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్10ఎన్3 స్ట్రెయిన్‌తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8 స్ట్రెయిన్) బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్లో చైనా హువాన్ ప్రావిన్స్‌లో ఓ బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్6 స్ట్రెయిన్) కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్5ఎన్1 మాత్రం కొంచెం రిస్క్ ఉన్న బర్డ్‌ఫ్లూ వైరస్. దీని రిస్క్ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్7ఎన్9 స్ట్రెయిన్ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎలా సోకుతుందంటే.. సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ తరహాలోనే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలు (హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్‌ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్ఫెక్షన్కి గురైన పక్షుల ద్వారా ఆ వ్యక్తిని వైరస్ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్‌వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు వేరియెంట్లతో రిస్క్ ఛాన్స్! వైరస్ స్ట్రెయిన్లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్ఏవో ఎమర్జెన్సీ సెంటర్ సైంటిస్ట్ ఫిలిప్ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్ఫెక్షన్ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక ఫ్లూ వైరస్లు వేగంగా మ్యుటేంట్ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న హెచ్10ఎన్3 వేరియెంట్ జెనెటిక్ సీక్వెన్స్ తెలిస్తేనే తప్ప.. రిస్క్ తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు. చదవండి: Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్ ఫ్లూ -
70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బర్డ్ ప్లూ వైరస్ బతకదు
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ వ్యాధిని కలుగజేసే వైరస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 30 నిముషాలకు మించి బతకదని పరిశోధనల్లో నిర్ధారౖణెనట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. పూర్తిగా ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదని, ప్రజలు లేనిపోని వదంతులు నమ్మకుండా వాటిని ఆహారంగా తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి బాగా విస్తరిస్తున్నందున రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనూహ్య రీతిలో కోళ్లు మరణిస్తే వెంటనే స్థానిక పశు వైద్యాధికారులకుగానీ, సమీప ఆర్బీకేలు, సచివాలయాలకుగానీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని శనివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. -
బర్డ్ ఫ్లూ కలకలం: 1,500 కోళ్లు మృతి
సాక్షి, డిచ్పల్లి (నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో 24 గంటల్లోపే 1,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ ఫామ్ యజమాని తెలిపిన ప్రకారం.. రెండు షెడ్లలో సుమారు 8,000 కోళ్లు పెంచుతున్నారు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా సుమారు వేయి కోళ్లు మృతి చెందాయి. బుధవారం ఉదయాన్నే గమనించిన ఫామ్ సిబ్బంది యజమానికి విషయం తెలిపారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మధ్యాహ్నం వరకు షెడ్లలో మరో 500 పైగా కోళ్లు కూర్చున్న చోటే కూలబడి చనిపోయాయి. చదవండి: బర్డ్ ఫ్లూ: చికెన్ అమ్మకాలపై నిషేధం మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణకు తెలుపడంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భరత్, ఏడీ (ల్యాబ్) కిరణ్ దేశ్‌పాండే సాయంత్రం పౌల్ట్రీ ఫామ్‌ను సందర్శించారు. ఫామ్ యజమానితో మాట్లాడా రు. చివరి వ్యాక్సినేషన్ ఎప్పుడు చేశారు, దాణా ఎవరూ సరఫరా చేస్తారు లాం టి వివరాలు తెలుసుకున్నారు. బతికి ఉన్న కోళ్ల రక్త నమూనాలను, చనిపోయిన కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కాగా, ఒక్కరోజే సుమారు 1,500 కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి తండవాసులతో పాటు మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లేదు కేసులు నమోదు కాలేదు ఇక్కడ చనిపోయిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవు. ఆర్మూర్, వర్నిలోని పౌల్ట్రీ ఫామ్‌లు సందర్శించాం. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదు. పరీక్ష ఫలితాలు రాగానే కోళ్లు ఎలా చనిపోయాయనేది తెలుస్తుంది. జిల్లాలోని పౌల్ట్రీ ఫామ్ యజమానులు జాగ్రత్తలు పాటించాలి. –డాక్టర్ భరత్ -
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ధోని కీలక నిర్ణయం
రాంచీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ప్రారంభించిన కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్ చేసిన రెండు వేల కడక్‌నాథ్ కోళ్లను, అంతే సంఖ్యలోని గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని ఆర్డర్ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ దృవీకరించారు. ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికి, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్సిన ధోని.. అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లకోళ్లు (కడక్‌నాథ్ కోళ్లు) అలాగే హైదరాబాద్ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై దృష్టి సారించారు. ఈ రకం కోళ్ల మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తున్నాయి. కడక్‌నాథ్ చికెన్ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. మన దేశంలో కడక్‌నాథ్ చికెన్ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ) అనే వైరస్.. పక్షి జాతుల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తుంది. లక్షలాది పక్షుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్ దేశంలోని పది రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా దీని ప్రభావం మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. -
బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?
పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. మనుషులకూ సోకుతుందా? మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు. ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు. ఎలాంటి పక్షులకు సోకుతుంది? కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
బర్డ్ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు బంద్
భోపాల్: కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్‌ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ‘ఇండోర్‌లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? ) 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్‌లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. -
బర్డ్ ఫ్లూ కలకలం: రెండు జిల్లాల్లో అలర్ట్
తిరువనంతపురం : దేశంలో మళ్లీ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి మొదలైంది. తాజాగా కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందని అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు, తక్షణ స్పందన కోసం బృందాలను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కాగా గత వారం కొట్టాయం, అలపూజ రెండు జిల్లాలో అనేక బాతులు మరణించాయి. వీటిలో ఎనిమిది బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్‌కు పంపించారు. వీటిలోని 5 శాంపిల్స్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్8) కనుగొన్నట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న అన్ని పక్షులను వేరే ప్రదేశాలకు మార్చారు. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా ఇప్పటికే 12000 బాతులు మృత్యువాత పడ్డాయి. అలాగే ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మరో 36,000 చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ వైరస్ మరణాలు సంభవించే ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించిన సంబంధిత ప్రాంతాల్లో వాటిని గుర్తించేందుకు అధికారులు డ్రైవ్ కూడా ప్రారంభించారు. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా ప్రాణాంతకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పక్షి మరణాలు సంభవించిన ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు విధించాయి. అంతేకాదు అటువంటి సైట్‌కు కిలోమీటరు దూరంలో ఉంటే పౌల్ట్రీని తొలగించాలని కూడా సూచించింది. -
లక్ష కోళ్లకు బర్డ్‌ఫ్లూ
హయత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో ఉన్న ఓ కోళ్ల పారంలోని లక్ష కోళ్లకు బర్డ్‌ప్లూ సోకినట్లు సమాచారం. బర్డ్‌ప్లూ సోకిన కోళ్లలో ఇప్పటికే 20 వేల కోళ్లు మృతి చెందాయి. కాగా, తొర్రూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఫారంలో మిగిలిన కోళ్లను చంపివేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, చనిపోయిన కోళ్లను కుప్పలుగా వేయడంతో వర్షం రావడంతో కొట్టుకుపోతున్నాయి. దీంతో కలెక్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
-
బర్డ్‌ఫ్లూ.. భయం..భయం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శివార్లలో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్(బర్డ్ ఫ్లూ)భయట పడింది. హయత్ నగర్ లోని ఓ కోళ్లఫాంలో కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు పూణే ల్యాబ్ నిర్ధారించింది. కోళ్ల ఫారంలోని 80 వేల కోళ్లకి బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వ్యాధి సోకిన కోళ్లని ఈ రోజు అధికారులు చంపేయనున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో రెవెన్యూ అధికారులు వెంటనే హైఅలర్ట్ ప్రకటించారు . -
బర్డ్‌ఫ్లూ భయం
రాష్ట్రం బర్డ్‌ఫ్లూ భయంతో వణికిపోతోంది. రెండు రోజుల్లో 50 కోళ్లు మరణించడం, వందలాది కోళ్లు వ్యాధిబారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి నల్లకోళ్ల రవాణా దాదాపు స్తంభించిపోగా కేరళ రాష్ట్రం నుంచి బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చెక్‌పోస్టుల వద్ద గట్టి బందోబస్తును అమలు చేస్తున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: కేరళ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నల్లకోళ్లు, గుడ్ల వ్యాపారం అనాదిగా సాగుతోంది. కేరళ నుంచి చేపలు, కోళ్లు, చనిపోయిన పశువుల మాంసాల రవాణా తమిళనాడుకు సాగుతోంది. కేరళ రాష్ట్రంలోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకి ందన్న సమాచారంతో రాష్ట్రం అప్రమత్తమైంది. పల్లడం, నామక్కల్ తదితర జిల్లాల్లోని కోళ్లఫారాల నుంచి రవాణా నిలిపివేశారు. నామక్కల్ జిల్లాలోని ఒక కోళ్లఫారంలో రూ.2.50 కోట్ల విలువైన కోళ్లు, గుడ్లు కొనేవారు లేక నిలిచిపోయాయి. పల్లడం, హోసూరులలో 50 లక్షల కోళ్లు ఫారంలోనే ఉండిపోయాయి. దీంతో రూ.35 కోట్ల విలువైన 50 లక్షల నల్లకోళ్ల విక్రయూలు ఆగిపోయూరుు. తమిళనాడులో నల్లకోళ్లకు, గుడ్ల వాడకానికి ఐదు జిల్లాల్లో నిషేధం విధించారు. దీంతో కేరళ రాష్ట్రం సైతం తమిళనాడుకు సరుకును తగ్గించి వేసింది. రాష్ట్ర సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నామక్కల్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందడంతో పశుసంవర్ధక శాఖామంత్రి, జిల్లా కలెక్టర్ శనివారం పరిస్థితిని సమీక్షించారు. నీలగిరి జిల్లాలో శుక్రవారం 20 కోళ్లు, శనివారం 50 కోళ్లు చనిపోయాయి. 20 లక్షల నుంచి 50 లక్షల వరకు నల్లకోళ్లను పెంచుతున్న ఫారాల్లో రోజుకు లక్షల సంఖ్యలో గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే బర్డ్‌ఫ్లూ భయం వల్ల ఎగుమతికి నోచుకోక ఫారంలోనే పడిఉన్నాయి. అనారోగ్యంతో చనిపోయిన కోళ్లను తగులబెట్టరాదని జిల్లా కలెక్టర్లు ప్రచారం చేయిస్తున్నారు. కోళ్లను తగులబెట్టినవారిపై చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంచరించే వాహనాల్లో ఎటువంటి జంతు, పశుపక్ష్యాదుల పదార్థాలు లేకుండా తనిఖీలు చేపడుతున్నారు.