
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు పశుసంవర్ధకశాఖ అధికారులు.
వివరాల ప్రకారం.. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. ఇక, బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది.
ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు. అలాగే, బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment