Sample testing
-
నెల్లూరులో వేల సంఖ్యలో కోళ్ల మృతి.. చికెన్ షాపులు బంద్
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో, కోళ్లకు సంబంధించిన శాంపిల్స్‌ను భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు పశుసంవర్ధకశాఖ అధికారులు. వివరాల ప్రకారం.. నెల్లూరులోని చాటగుట్ల, గుమ్మళ్లదిబ్బలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్ సేకరించి భోపాల్‌లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. ఇక, బర్డ్ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు. అలాగే, బర్డ్ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. -
కరోనా టెస్టుల్లో అక్రమ దందా
అతను జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత క్లినిక్‌లో రాత్రివేళ కరోనా లక్షణాలున్న వారి నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నాడు. వాటిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. అనుమతి లేకున్నా అక్రమంగా స్వాబ్‌లను సేకరించి పరీక్ష చేయించేందుకు రూ. 3,500 వసూలు చేస్తున్నాడు. వరంగల్లోనూ ఒక ప్రభుత్వ వైద్యుడు ఇదే నిర్వాకానికి తెరలేపాడు. అనేకచోట్ల శాంపిళ్లు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సొంత నర్సింగ్ హోంలో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. అక్కడ శాంపిళ్లను సేకరించి ఈయన కూడా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత్యంతరం లేక కొందరు లక్షణాలున్న బాధితులు రూ. 3 వేల నుంచి 4 వేలు ఇచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అక్రమ దందాకు తెరలేపారు. జనగాం జిల్లాకు చెందిన ఆ వైద్యాధికారి తన క్లినిక్‌కు వచ్చే వారిలో లక్షణాలున్న వారిని రాత్రి వేళ రమ్మని చెప్పి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగే ఆ క్లినిక్‌లో శాంపిళ్లు ఇవ్వడం గమనార్హం. 3 రోజుల్లో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్ నుంచి పాజిటివ్ వచ్చిందంటూ అతనికి ఫలితాల రిపోర్టు ఇచ్చా రు. పాజిటివ్ వచ్చాక ఆ జిల్లాస్థాయి అధికారే ఆయనకు వైద్యం చేశాడు. ఇలా కొందరు అక్రమంగా శాంపిళ్లు సేకరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. శాంపిళ్లు సేకరించే అధికారం ఎక్కడిది? రాష్ట్రంలో ఐసీఎంఆర్ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్‌లోని కొన్ని ఆసుపత్రులు, లేబోరేటరీల్లో మాత్రమే కరోనా శాంపిళ్లు సేకరించే అవకాశం, పరీక్ష నిర్వహించే వెసులుబాటుంది. కరోనా వైద్యం చేసే చాలా ఆసుపత్రులకు శాంపిళ్లు సేకరించి పరీక్ష చేసే వెసులుబాటు లేదంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి పొందిన పేరు మోసిన ప్రైవేట్ లేబరేటరీలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే సక్రమంగా శాంపిళ్ల సేకరణ, పరీక్షలు జరగడంలేదంటూ ఐసీఎంఆర్ గుర్తించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేయడం విదితమే. వాటిల్లో 12 లేబరేటరీలకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. అలాంటిది అడ్రస్‌లేని క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో కరోనా లక్షణాలున్న వారినుంచి శాంపిళ్లను సేకరించడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతి ప్రకారం ఒక పరీక్షకు రూ. 2,200 మాత్రమే తీసుకోవాలి. కానీ జనగాం క్లినిక్‌లో ఏకంగా రూ. 3,500 తీసుకోవడం గమనార్హం. ప్రత్యేక శిక్షణ ఉండాల్సిందే... కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు గొంతు లేదా ముక్కులో నుంచి స్వాబ్ నమూనాలను సేకరిస్తారు. అది సేకరించాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది అవసరం. లేకుంటే పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలుంటాయని అంటున్నారు. సరైన పరిమాణంలో స్వాబ్ సేకరణ జరగకుంటే, ఒక్కోసారి పరీక్ష నిర్వహించడం కూడా సాధ్యంకాదని నిపుణులు అంటున్నారు. జిల్లాల్లో విరివిగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అనేకమంది బాధితులు ఇలాంటి అక్రమార్కుల వలలో పడుతున్నారు. జిల్లా ఆసుపత్రుల్లో, కొన్ని అనుమతి ఉన్నచోట్ల మాత్రమే శాంపిళ్లు సేరిస్తుండటం, అక్కడ రద్దీ ఎక్కువ ఉండటంతో కొందరు అక్రమార్కులు తమ ప్రైవేట్ క్లినిక్‌లలో అక్రమంగా శాంపిళ్లు సేకరించి పంపిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కరెన్సీగా మార్చుకుంటున్నారు. రూ. 3,500 వసూలు చేసి, ల్యాబ్‌కు సగం ఇచ్చి, తాము సగం తీసుకుంటున్నట్లు సమాచారం. అటువంటి పరీక్షలు రిపోర్టులు ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్లోడ్ కావడంలేదని ఒక వైద్య నిపుణుడు తెలిపారు. -
ఒకేరోజు 5వేల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేరోజులో 5 వేల శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యం గల ఆటోమేటిక్ మెషీన్ ల్యాబ్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. రూ.10 కోట్ల మేర వరకు ఖర్చు చేసి దీన్ని తీసుకురానుంది. అమెరికాలోని రష్ అనే కంపెనీ నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొనుగోలు వ్యవహారాన్ని సీఎం ఆఫీసు పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. మూడు వారాల్లోగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కరోనా మాత్ర మే కాకుండా, అన్ని వైరస్‌లకు సంబంధించిన టెస్టులను ఈ యంత్రాలతో చేయొచ్చు. అలాగే కార్మిక శాఖ ఆధ్వర్యంలోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటిం గ్స్ ల్యాబ్‌లలో ఈ నెల 18 నుంచి కరోనా పరీక్ష లు నిర్వహించి తొందరలోనే అందుబాటులోకి తీ సుకొస్తారు. అమెరికా నుంచి వచ్చే ఆటోమేటి క్ మెషీన్ ల్యాబ్‌తో మరో 5 వేల వరకు పరీక్షలు చేసే సామర్థ్యం పెరగనుంది. ప్రస్తుతం వివిధ ల్యాబుల్లో రోజుకు గరిష్టంగా 700 పరీక్షలే చేయ గలుగుతున్నారు. సిబ్బంది కొరతే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 20న గచ్చిబౌలి ఆసుపత్రి ప్రారంభం.. ఈ నెల 20న గచ్చిబౌలిలో కరోనా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, గాగుల్స్, వైద్య పరికరాలు సమకూర్చుకుని భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్లు పెట్టిందని వివరించారు. ప్లాస్మా థెరపీ చికిత్సపై ఐసీఎంఆర్‌కు ఇప్పటికే లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. వాళ్లు ఇంకా ఉన్నారు..: మర్కజ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తితో పాతబస్తీలోని తలాబ్ కట్టా ప్రాంతంలో ఒకే కుటుంబంలో 20 మందికి వైరస్ సోకిందని మంత్రి ఈటల తెలిపారు. మరో ఆరుగురు 81 మందికి వైరస్ అంటించారని చెప్పారు. కరీంనగర్లో 10 మంది ఇండొనేసియా పౌరులు వచ్చి అనేక చోట్ల తిరిగారన్నారు. జిల్లా కలెక్టర్, యం త్రాంగం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టి మరిన్ని కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో కూడా కరీంనగర్ తరహా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ విషయంలో అక్కడక్కడా ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. మర్కజ్ వెళ్లిన వా ళ్లు ఇంకా ఉన్నారన్నారు. కంటైన్మెంట్ జోన్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించా రు. గాంధీ, ఛాతీ, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, తాత్కాలిక మరమ్మతులపై సమీక్షించామని, వారందరికీ సమయానికి అందించాల్సి న భోజన ఏర్పాట్లు కల్పిస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన 87 లక్షల కుటుంబాలకు బియ్యం, నగదు పంపిణీ చేసిన ట్లు తెలిపారు. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకునే క్రమంలో ప్రజ లు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా వస్తున్నారని.. అలా జరగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు లక్షల సంఖ్యలో మాస్కులు తయారు చేస్తున్నారని.. హైదరాబాద్‌లో రోజూ 3 లక్షల మాస్కులు తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. -
మరో డీఈ ఔట్
వరంగల్, న్యూస్‌లైన్ : కేబుల్ కుంభకోణం లో మరో అధికారిపై వేటు పడింది. ఇప్పటికే ఇద్దరు డీఈలను సరెండర్ చేయగా.. మరో డీఈని సరెండర్ చేస్తూ ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సరెండర్ చేసిన నిజామాబాద్ డీఈ సదానందం కేబుల్ కొనుగోలు సమయంలో ప్రధాన పాత్ర పోషించారు. 11 కేబీ ఏబీ కేబుల్ వినియోగం, కొనుగోలుపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. శాంపి ల్ టెస్టింగ్ వెళ్లిన ముగ్గురు ఇంజినీర్లలో సదానందం కూడా ఒకరు. టెస్టింగ్, స్టోర్‌లో డం పింగ్ సమయంలోనే కేబుల్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ తతంగంపై విచారణ సాగుతుండగానే ముగ్గురు డీఈలపై వేటు పడింది. గతంలో కేబుల్ కుం భకోణం విషయంలో బయటకు లీకు చేశారంటూ పలు యూనియన్లు గొడవకు దిగడంతో మనస్తాపానికి గురైన కంపెనీ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు రాజీనామా చేశారు. రాజీనా మా ఆమోదించడంతో పాటు కొత్త డెరైక్టర్‌గా జి.సుదర్శన్‌ను నియమించారు. ఇదే వివాదంలో కరీంనగర్ కన్స్ట్రక్షన్ డీఈ గూడూర్ సమ్మిరెడ్డిని అక్కడ నుంచి బదిలీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సరెండర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా జిల్లా డీఈని గతంలోనే బదిలీ చేశా రు. తాజాగా నిజామాబాద్ కన్స్ట్రక్షన్ డీఈ సదానందంను సరెండర్ చేస్తూ బుధవారం సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. కేబుల్‌ను పరిశీలించకుండా.. నాణ్యత లేకుండా వచ్చి న కేబుల్ వినియోగించినట్లు రూఢీ కావడం తో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ కన్స్ట్రక్షన్ డీఈలపై వేటు వేశారు. కుదిపేస్తున్న కుంభకోణం కేబుల్ కుంభకోణం ఎన్పీడీసీఎల్‌ను కుదిపేస్తోంది. కేబుల్ కొనుగోళ్లలో రూ.15 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. పర్చేజ్, కన్స్ట్రక్షన్ విభాగాల పాత్రపై విచారణ సాగుతోంది. ఇప్పటికే జిల్లాలో విచారణ ముగియ గా.. ఓ డీఈపై వేటు వేశారు. కరీంనగర్లో కూడా ముందుగా ఈ కేబుల్ ఫెయిల్ కావడంపై విచారణ చేపట్టారు. రామగుండం, గోదావరిఖనిలో వేసిన ఈ కేబుల్ విద్యుత్ సరఫరా చేయగానే కాలిపోయింది. ఈ వ్యవహారం ఎన్పీడీసీఎల్లో కలకలం రేపింది. ఇప్పటికే నాసిరకం కేబుల్‌ను కొనుగోలు చేసినట్లు, కన్స్ట్రక్షన్ అధికారులు ఈ విషయంలో నోరుమెదపలేదనే ఆరోపణలున్నాయి. కరీంనగర్ జిల్లాలో విచారణ చేసిన అధికారులు రిపోర్టును సీఎండీకి అప్పగించారు. దీంతో ముందుగా అక్కడి కన్స్ట్రక్షన్ డీఈ సమ్మిరెడ్డిని బదిలీ చేశారు. అన్ని జిల్లాల్లో విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కన్స్ట్రక్షన్ డీఈ సదానందంను కార్పొరేట్ కార్యాలయంలో సరెండర్ చేశారు. దీంతో ముగ్గురు డీఈలపై వేటు పడినట్లైంది. మరో రెండు జిల్లాల్లో ఇంకా విచారణ సాగుతోంది. అయితే డీఈ సదానందం సరెండర్‌లో ఉన్నతాధికారుల మధ్య విభేదాలే కారణమనే ప్రచారం కూడా జరుగుతోంది. అక్కడ కన్స్ట్రక్షన్ విభాగం కింద చేస్తున్న పనుల్లో నాణ్యత ఉన్నప్పటికీ... ఆ జిల్లాలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య గ్రూపు రాజకీయాల కారణంగానే సదానందంపై వేటు పడిందని ఎన్పీడీసీఎల్లో ప్రచారం జరుగుతోంది.