సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేరోజులో 5 వేల శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యం గల ఆటోమేటిక్ మెషీన్ ల్యాబ్‌ను అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. రూ.10 కోట్ల మేర వరకు ఖర్చు చేసి దీన్ని తీసుకురానుంది. అమెరికాలోని రష్ అనే కంపెనీ నుంచి దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొనుగోలు వ్యవహారాన్ని సీఎం ఆఫీసు పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. మూడు వారాల్లోగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కరోనా మాత్ర మే కాకుండా, అన్ని వైరస్‌లకు సంబంధించిన టెస్టులను ఈ యంత్రాలతో చేయొచ్చు. అలాగే కార్మిక శాఖ ఆధ్వర్యంలోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రి, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటిం గ్స్ ల్యాబ్‌లలో ఈ నెల 18 నుంచి కరోనా పరీక్ష లు నిర్వహించి తొందరలోనే అందుబాటులోకి తీ సుకొస్తారు. అమెరికా నుంచి వచ్చే ఆటోమేటి క్ మెషీన్ ల్యాబ్‌తో మరో 5 వేల వరకు పరీక్షలు చేసే సామర్థ్యం పెరగనుంది. ప్రస్తుతం వివిధ ల్యాబుల్లో రోజుకు గరిష్టంగా 700 పరీక్షలే చేయ గలుగుతున్నారు. సిబ్బంది కొరతే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. కాగా, గాంధీ ఆసుపత్రిలో కరోనా బారిన పడిన మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
20న గచ్చిబౌలి ఆసుపత్రి ప్రారంభం..
ఈ నెల 20న గచ్చిబౌలిలో కరోనా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షలకు తగ్గకుండా పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, గాగుల్స్, వైద్య పరికరాలు సమకూర్చుకుని భద్రపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం ఆయన విలేక రులతో మాట్లాడుతూ.. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్లు పెట్టిందని వివరించారు. ప్లాస్మా థెరపీ చికిత్సపై ఐసీఎంఆర్‌కు ఇప్పటికే లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.
వాళ్లు ఇంకా ఉన్నారు..: మర్కజ్‌కు వెళ్లొచ్చిన వ్యక్తితో పాతబస్తీలోని తలాబ్ కట్టా ప్రాంతంలో ఒకే కుటుంబంలో 20 మందికి వైరస్ సోకిందని మంత్రి ఈటల తెలిపారు. మరో ఆరుగురు 81 మందికి వైరస్ అంటించారని చెప్పారు. కరీంనగర్‌లో 10 మంది ఇండొనేసియా పౌరులు వచ్చి అనేక చోట్ల తిరిగారన్నారు. జిల్లా కలెక్టర్, యం త్రాంగం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టి మరిన్ని కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో కూడా కరీంనగర్ తరహా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ విషయంలో అక్కడక్కడా ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. మర్కజ్ వెళ్లిన వా ళ్లు ఇంకా ఉన్నారన్నారు. కంటైన్మెంట్ జోన్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించా రు. గాంధీ, ఛాతీ, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు, తాత్కాలిక మరమ్మతులపై సమీక్షించామని, వారందరికీ సమయానికి అందించాల్సి న భోజన ఏర్పాట్లు కల్పిస్తూ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన 87 లక్షల కుటుంబాలకు బియ్యం, నగదు పంపిణీ చేసిన ట్లు తెలిపారు. ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదును తీసుకునే క్రమంలో ప్రజ లు భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా వస్తున్నారని.. అలా జరగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలు లక్షల సంఖ్యలో మాస్కులు తయారు చేస్తున్నారని.. హైదరాబాద్‌లో రోజూ 3 లక్షల మాస్కులు తయారవుతున్నాయని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment