రాష్ట్రం బర్డ్‌ఫ్లూ భయంతో వణికిపోతోంది. రెండు రోజుల్లో 50 కోళ్లు మరణించడం, వందలాది కోళ్లు వ్యాధిబారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి నల్లకోళ్ల రవాణా దాదాపు స్తంభించిపోగా కేరళ రాష్ట్రం నుంచి బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చెక్‌పోస్టుల వద్ద గట్టి బందోబస్తును అమలు చేస్తున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేరళ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నల్లకోళ్లు, గుడ్ల వ్యాపారం అనాదిగా సాగుతోంది. కేరళ నుంచి చేపలు, కోళ్లు, చనిపోయిన పశువుల మాంసాల రవాణా తమిళనాడుకు సాగుతోంది. కేరళ రాష్ట్రంలోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకి ందన్న సమాచారంతో రాష్ట్రం అప్రమత్తమైంది. పల్లడం, నామక్కల్ తదితర జిల్లాల్లోని కోళ్లఫారాల నుంచి రవాణా నిలిపివేశారు. నామక్కల్ జిల్లాలోని ఒక కోళ్లఫారంలో రూ.2.50 కోట్ల విలువైన కోళ్లు, గుడ్లు కొనేవారు లేక నిలిచిపోయాయి. పల్లడం, హోసూరులలో 50 లక్షల కోళ్లు ఫారంలోనే ఉండిపోయాయి. దీంతో రూ.35 కోట్ల విలువైన 50 లక్షల నల్లకోళ్ల విక్రయూలు ఆగిపోయూరుు.
తమిళనాడులో నల్లకోళ్లకు, గుడ్ల వాడకానికి ఐదు జిల్లాల్లో నిషేధం విధించారు. దీంతో కేరళ రాష్ట్రం సైతం తమిళనాడుకు సరుకును తగ్గించి వేసింది. రాష్ట్ర సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నామక్కల్ జిల్లాలో బర్డ్‌ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందడంతో పశుసంవర్ధక శాఖామంత్రి, జిల్లా కలెక్టర్ శనివారం పరిస్థితిని సమీక్షించారు. నీలగిరి జిల్లాలో శుక్రవారం 20 కోళ్లు, శనివారం 50 కోళ్లు చనిపోయాయి. 20 లక్షల నుంచి 50 లక్షల వరకు నల్లకోళ్లను పెంచుతున్న ఫారాల్లో రోజుకు లక్షల సంఖ్యలో గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే బర్డ్‌ఫ్లూ భయం వల్ల ఎగుమతికి నోచుకోక ఫారంలోనే పడిఉన్నాయి. అనారోగ్యంతో చనిపోయిన కోళ్లను తగులబెట్టరాదని జిల్లా కలెక్టర్లు ప్రచారం చేయిస్తున్నారు. కోళ్లను తగులబెట్టినవారిపై చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. రెండు రాష్ట్రాల మధ్య సంచరించే వాహనాల్లో ఎటువంటి జంతు, పశుపక్ష్యాదుల పదార్థాలు లేకుండా తనిఖీలు చేపడుతున్నారు.
బర్డ్‌ఫ్లూ భయం
Published Sun, Nov 30 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement