కొక్కొరొకో.. మ్యూజిక్ వీడియో వైరల్!
Published Sat, Jun 10 2017 8:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
కొక్కొరొకో అంటూ... తన కూతతో ఉదయాన్నే మనల్ని నిద్రలేపే కోడి... అద్భుతమైన మ్యూజిక్ కూడా వాయిస్తోంది. చూడచక్కగా... వినసొంపుగా పియానాతో రాగాలు పలికిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ..? అమెరికాలో జరిగిన ఓ రియాలిటీ టాలెంట్ షోలో ఒక కోడి తన సంగీత ప్రతిభను చాటి ప్రేక్షకుల మది దోచుకుంది. ముక్కుతో పియానో బటన్స్ నొక్కుతూ మ్యూజిక్‌తో రంజింప చేసింది. కోడి పలికించిన స్వరాగాలు విన్న అక్కడి ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Advertisement
Advertisement