
కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అనే సామెతలు మన దగ్గర చాలా ప్రసిద్ధి. ఒంటరిగా సాధించలేని కార్యాన్ని, లక్ష్యాన్ని ఐకమత్యంతో సాధించవచ్చని చెప్పే కథలు కోకొల్లలు. చిన్నప్పుడు మనం చదవుకున్న ఎద్దు, సింహం కూడా ఈ కథ కూడా ఈ కోవలోకే వస్తుంది. తాజాగా ఐకమత్యం గొప్పతనాన్ని చాటే సంఘటన ఒకటి వాస్తవంగా చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తమ మిత్రుడిపై దాడి చేయడానికి వచ్చిన పిల్లిని కోడిపెట్టలు పొడిచి పొడిచి మరి తరిమాయి.
వీటి ఐకమత్యాన్ని చూసిన నెటిజనలు తెగ సంబరపడుతున్నారు. మా కంటే మీరే నయం అంటూ ప్రశంసిస్తున్నారు. రెండు నెలల క్రితం నాటి ఈ వీడియో తాజాగా మరోసారి వైరలవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియవు. ఇక వీడియోలో పొలంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ కోడిపెట్టను పిల్లి గమనిస్తుంది. ఒంటరిగా బలే చిక్కింది.. ఈ రోజు నాకు పండగే అని సంబరపడుతూ కోడి మీద దాడి చేయడానికి వస్తుంది. అయితే మిత్రుడికి వచ్చిన ఆపద చూసి మిగతా కోడి పెట్టలు అలర్ట్ అవుతాయి. పోలోమంటూ వచ్చి.. పిల్లిపై దాడి చేస్తాయి. ఊహించని ఈ ఘటనకు బిత్తరపోయిన పిల్లి నెమ్మదిగా అ‍్కడ నుంచి జారుకుంటుంది.