![Hen Different Bike Poses In Chittoor District - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/13/0111.jpg.webp?itok=7YFaAyAk)
సాక్షి, కురబలకోట( చిత్తూరు): ఎవరది.. ఏమా రాజసం.. పందెం కోడి పుంజులా ఎంత పొగరెక్కి ఉందో. ఇదేందిది.. నేను ఎటు కదిలితే అటు కదులుతోంది. ఓహ్.. అది నేనేనా! చిత్తూరు జిల్లా కురబలకోట మండలం పోరెడ్డివారిపల్లెలో ఓ కోడి పుంజు బైక్ పైకెక్కి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆశ్చర్యపోసాగింది.
తన కదలికలను బట్టి ఆ ప్రతిబింబం తనదేనని గ్రహించిందో ఏమోగానీ.. మరికొంత సేపు చూసుకుని మురిసిపోయి ఆ తర్వాత బైక్ దిగి వెళ్లిపోయింది. ఈ దృశ్యం చూపరులకు ముచ్చటగొలిపింది.
Comments
Please login to add a commentAdd a comment