‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు | Former MLA Son Filed A Case On Hen Death In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

‘నా కోడిది హత్య.. న్యాయం చేయండి’ మాజీ ఎమ్మెల్యే తనయుడు

Published Sun, Sep 12 2021 9:27 PM | Last Updated on Mon, Sep 20 2021 11:12 AM

Former MLA Son Filed A Case On Hen Death In Uttar Pradesh - Sakshi

లక్నో: తన కోడిని ఎవరో హత్య చేశారు.. వారిని కనిపెట్టండంటూ ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కోడికి పోస్టుమార్టం చేసి నిందితులను అరెస్ట్‌ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ కేసును విన్న పోలీసులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ మహారాజ్‌గంజ్‌ జిల్లా పిప్రకల్యాణ్‌ గ్రామానికి చెందిన దుఖీ ప్రసాద్‌ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు రాజ్‌కుమార్‌ భారతి.
చదవండి: నీట్‌ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి 

రాజ్‌కుమార్‌ పక్షుల ప్రేమికుడు. అతడు ఎన్నో పక్షులను పెంచి పోషిస్తున్నాడు. వాటిలో భాగంగా ఓ కోడిని కూడా పెంచుకుంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ కోడి అకస్మాత్తుగా మృతి చెందింది. కోడి మృతిపై అతడు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడికి ఎవరో విషం పెట్టి చంపేశారని సింధూరియన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కేసు పెట్టి దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కోడికి పోస్టుమార్టం చేయాలని విజ్ఞప్తి చేశాడు. వెంటనే కోడిని చంపిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. కేసు దాఖలు చేసిన అనంతరం రాజ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడాడు. తాను పక్షుల ప్రేమికుడినని.. తన దగ్గర చిలుకలు, పావురాలు, కోళ్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రేమగా పెంచిపోషిస్తున్నట్లు తెలిపాడు. తనను గిట్టని వారు ఉద్దేశపూర్వకంగా కోడికి విషయం పెట్టి చంపేశారు అని ఆరోపించాడు.
చదవండి: భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్‌.. కానీ ప్రియుడేమో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement