
ప్రతీకాత్మక చిత్రం
లాహోర్: పాకిస్థాన్‌లో ఓ బాలుడు అత్యంత వికృతమైన చర్యకు ఒడిగట్టాడు. ఎవరూ ఊహించలేని రీతిలో కోడి మీద అత్యాచారం జరిపాడు. ఈ ఘటనలో 14 ఏళ్ల అన్సర్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని హఫీజ్‌బాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని జలాపూర్ గ్రామస్తుడైన అన్సర్‌పై పొరుగింటికి చెందిన మన్సబ్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 11న అలీ తన కోడిని కిడ్నాప్ చేసి.. దానిపై లైంగిక దాడి జరిపాడని తెలిపాడు. అతను అత్యాచారం జరుపుతుండగా కోడి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నాడు.
నస్రుల్లా, తుఫైల్ అనే వ్యక్తులు.. అలీ కోడి మీద అఘాయిత్యానికి పాల్పడుతుండగా ప్రత్యక్షంగా చూశారని ఫిర్యాదుదారు పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోడి మీద అఘాయిత్యం జరిగిందని మెడికల్ రిపోర్ట్స్ ధ్రువీకరించడంతో నిందితుడిని అరెస్టు చేశామని, పోలీసుల విచారణలో తాను లైంగిక దాడికి పాల్పడినట్టు అతను అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కామోద్రేకంతో ఈ చర్యకు పాల్పడినట్టు నిందితుడు పేర్కొన్నాడని, అతనిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment