Hen Roaming At Pentagon Security Checkpoint, Taken Into Custody In America - Sakshi
Sakshi News home page

Viral: అనుమానాస్పదంగా తిరుగుతోందని కస్టడీలోకి కోడి.. ఎక్కడో తెలుసా?

Published Fri, Feb 4 2022 3:29 PM | Last Updated on Fri, Feb 4 2022 4:19 PM

Viral: Hen wandering at Pentagon security area taken into custody - Sakshi

వాషింగ్టన్‌: సాధారణంగా ఎవరైనా వ్యక్తులు అనుమానితులుగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తారు. వారికి నేరంతో ఏ సంబంధం లేదని తేల్చాక విడిచిపెడతారు. ఈ ప్రక్రియ దాదాపు అన్ని దేశాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ అమెరికాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెంటగాన్‌ సెక్యూరిటీ ప్రాంతంలో ఓ కోడి అనుమానితంగా తిరుగుతోందని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక జంతు సంక్షేమ సంస్థ వెల్లడించింది. సోమవారం తెల్లవారుజామున యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో కోడి తిరుగుతూ కనిపించిందని వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో తెలిపింది.
చదవండి: Viral Video: మ్యాజిక్‌ ట్రిక్‌ని చూసి నోరెళ్ల బెట్టిన కోతి

భద్రతా తనిఖీ కేంద్ర వద్ద కోడి అనుమానంగా తిరుగుతుండటంతో, దానిని తీసుకెళ్లేందుకు తమ అధికారులను పిలిచారని జంతు సంరక్షణ సంఘంలోని ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. గోధుమ రంగు ఈకలు కలిగిన ఈ కోడి పేరు హెన్నీ పెన్నీ.  ఆ కోడి ఎక్కడ నుంచి వచ్చింది, పెంటగాన్‌కి ఎలా వచ్చిందనే విషయాలను సంబంధిత అధికారులు వెల్లడించలేదు. అయితే ఈ కోడిని పశ్చిమ వర్జీనియాలో చిన్న పొలం ఉండి కోళ్ల ఫామ్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు. 
చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement