Andhra Pradesh : Hen Delivered Egg In Peddakannali, Chittoor - Sakshi
Sakshi News home page

కోడిపుంజు గుడ్డు పెట్టింది.. ఇది నిజం!

Published Thu, Aug 5 2021 7:50 AM | Last Updated on Thu, Aug 5 2021 2:24 PM

Hen Delivered Egg In Peddakannali, Chittoor - Sakshi

గుడ్లు పెట్టి పొదిగిన కోడిపుంజు

తొట్టంబేడు: కోడిపెట్ట గుడ్లు పెట్టడం సృష్టి ధర్మం. ఇక్కడ విచిత్రంగా కోడిపుంజు గుడ్లు పెట్టి, పిల్లలు పొదిగింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రమణ్యంరెడ్డి ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజు ఉంది. ఈ కోడి పుంజు ఐదు గుడ్లు పెట్టింది. ఇదేంటి గుడ్లు పెడుతోందని యజమాని ఆశ్చర్యపోయాడు. అయితే ఏం చేస్తుందో చూడాలని, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement