జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన చిలక ముక్కు కోడిపుంజు
కొమరోలు: ప్రకాశం జిల్లా పుంజు అంటే మజాకా.. అన్నట్టుగా మరోసారి నిరూపితమయింది. కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషాకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో ఈ పుంజు 3వ స్థానం దక్కించుకోగా పుంజు యజమాని సయ్యద్ బాషాను బహుమతులు వరించాయి. నిర్వాహకులు ప్రశంస పత్రం, షీల్డ్‌ను అందజేశారు.
రాజుపాలెం కోళ్లు అందానికి మారుపేరు. బలమైన కాళ్లు, అంతకు మించిన శక్తితో రెక్కలు, సూటిగా ఉండే చిలక ముక్కు వీటికి ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఎన్ని కోళ్లు ఉన్నా ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి, విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి యజమానులు కూడా ఈ కోళ్లు అందంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తారు. వేళకు భోజనం, కొన్ని ఎక్సర్ సైజ్ లు , ప్రత్యేకంగా స్నానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోడిపై పెట్టే శ్రద్ధ.. అంతా ఇంతా కాదు. అందుకే 5 రాష్ట్రాలకు చెందిన కోళ్లతో పోటీ పడి మరీ రాజుపాలెం కోడిపుంజు విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment